ఈవారం విడుదల కాబోతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ తో మొదలై అక్టోబర్ 21న విడుదల కాబోతున్న అఖిల్ తొలి సినిమా వరకు ఈ మూడు నెలలలో భారీ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు జరగబోతున్న రేస్ లో టాలీవుడ్ నిర్మాతల అదృష్టంతో 350 నుండి 400 కోట్ల వరకు భారీ మొత్తం ఈ రేసులో చిక్కుకోవడం టాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. సమ్మర్ రేస్ కు వస్తాయి అనుకున్న భారీ సినిమాలు రకరకాల కారణాలతో ఆలస్యం కావడంతో ఇప్పుడు ఈ మూడు నెలలు జరగబోయే రేస్ కు రెడీ అవుతున్నాయి. 

అయితే అటు సంక్రాంతి లాంటి భారీ పండుగలు కాని ఇటు సమ్మర్ లాంటి సెలవుల హడావిడి లేని ఈ మూడు నెలలలో కేవలం స్టార్స్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని విడుదల అవుతున్న ఇన్ని భారీ సినిమాలను ఒకేసారి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న అనుమానం టాలీవుడ్ పెద్దలతో పాటుగా చాలామంది నిర్మాతలను వెంటాడుతోంది. ఈ శుక్రువారం 7న విడుదలావుతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ ఇప్పటికే 60 కోట్ల బిజినెస్ పూర్తిచేసి విడుదలకు సిద్ధంగా ఉంటే ఈ సినిమా తరువాత విడుదల కాబోతున్న రవితేజా ‘కిక్ 2’ 30 నుండి 40 కోట్ల వరకు బిజినెస్ చేయడం ఖాయం అని అంటున్నారు. 

ఈనెలలో ఈరెండు భారీ సినిమాలతో పాటుగా ‘భలే భలే మగాడివోయ్’ లాంటి కొన్ని చిన్న సినిమాలు కూడ విడుదల కాబోతున్నాయి. ఇక రాబోతున్న సెప్టెంబర్ లో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తో పాటు కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటించిన ‘పులి’ సినిమాలతో పాటుగా హీరో రామ్, సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమాలు కూడా సెప్టెంబర్ లోనే విడుదల కాబోతున్నాయి. ఇక మన తెలుగు ప్రజలు బాగా ఘనంగా జరుపుకునే దసరా పండుగ అక్టోబర్ లో వస్తున్న నేపధ్యంలో ఈ పండుగకు ముందుగా రామ్ చరణ్ శ్రీనువైట్లల కాంబినేషన్ సినిమా విడుదల కాబోతు ఉంటే విజయదశమినాడు అక్టోబర్ 21న అఖిల్ వినాయక్ ల సినిమా విడుదల కాబోతోంది. 

వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడ ఈ రేస్ లో ఉన్నాయి. ఈ పరిస్థుతులలో ఎటువంటి పండుగలులేని ఆగష్టు సెప్టెంబర్ నేలలను కేవలం ఒకేఒక్క పండుగ దసరాను టార్గెట్ చేసుకుని ఇన్ని భారీసినిమాలు విడుదల అవుతూ ఉండటం హీరోల అభిమానులకు పండుగే అయినా ఈసినిమా పై పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు బయ్యర్లకు సంక్రాంతిని మించిపోయిన జుదంగా మారిందని ఫిలింనగర్ టాక్. ‘బాహుబలి’ విజయం చాలామందికి ఉత్సాహాన్ని ఇస్తున్నా అన్ని సినిమాలు ఆస్థాయిలో విజయవంతంకావు అన్నసత్యాన్ని రాబోతున్న టాలీవుడ్ సినిమాల 3 నెలల రేస్ రుజువు చేయబోతోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: