రామ్ గోపాల వర్మ శిష్యుడిగా కెరియర్ ప్రారంభించిన పూరీజగన్నాథ్ మహేష్ కోసం తన గురువు రామ్ గోపాల్ వర్మకు గట్టి క్లాస్ పీకాడు అని వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ నామస్మరణలో తరించిపోతున్న వర్మ మహేష్ ‘శ్రీమంతుడు’ ని టార్గెట్ చేస్తూ కొద్దిరోజుల క్రితం ట్విట్స్ పెట్టాడు. వర్మ ట్విట్స్ పై ఇప్పటికే మహేష్ అభిమానులు వర్మను టార్గెట్ చేసారు. 

అయితే ఈ విషయాలన్నీ పూరీజగన్నాథ్ దృష్టికి రావడంతో పూరీ వర్మకు క్లాస్ పీకాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ తో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ తీసిన పూరీకి వర్మ ట్విట్స్ వల్ల తనకు మహేష్ కు దూరం ఏర్పడుతుందని పూరీకి భయం ఏర్పడటంతో ఈ విషయమై నష్ట నివారణ చర్యలు చేపట్టడమే కాకుండా తన గురువు వర్మకు మహేష్ వ్యవహారంలో తల దూర్చ వద్దని వర్మకు సంకేతాలు ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. 

దీనితో తన శిష్యుడి కోసం వర్మ మరో ట్విట్ పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ అందంగా కనిపించినంతగా తనకు గతంలో మహేష్ ఏ సినిమాలోను అంత చార్మింగ్ గా కనిపించలేదు అంటూ ట్విట్ చేసి పూరీని శాంతపరిచాడు వర్మ.

ఇది చాలదు అన్నట్లుగా పూరీ మహేష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ తన ట్విటర్ లో పొగడ్తల జల్లు కురిపించాడు. ‘మహేష్ సినిమా విడుదల అవుతూ ఉంటే నాకే కాదు అందరికీ ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. మహేష్ తో పనిచేయడం ఒక కిక్’ అంటూ ట్విట్ చేసాడు. దీనితో మహేష్ పూరీ బుట్టలో పడి పూరీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న 3వ సినిమాను చేయడానికి ప్రిన్స్ అంగీకరిస్తాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: