బాహుబలి’ సృష్టికర్త రాజమౌళి నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోలపై పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో తన సినిమాల గురించి అనేక విషయాలు ఆ ఇంటర్వ్యూ లో షేర్ చేసుకుంటూ హీరోలపై చేసిన సంచలన వ్యాఖ్యలు టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఎంత పెద్ద హీరో నటించే సినిమాకు అయినా కథ ‘1’ వ స్థానంలో ఉంటుందని ఆ తరువాత వచ్చే ‘0’ లు మాత్రమె హీరోలు అంటూ ముందు ఒకట్ల స్థానం లో ‘1’ అంకె లేకుండా ఎన్ని ‘0’ లు పెట్టినా ఆ ‘0’ లకు విలువుండదు అని హీరోల స్థాయి పై వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి.

ఇదే సందర్భంలో తాను తీసిన ‘బాహుబలి’ గురించి వ్యాఖ్యానిస్తూ తనకు మహాభారతం కధను సినిమాగా తీయాలి అనే కోరిక జీవిత ధ్యేయం అని అంటూ ఆ సినిమా తీయడానికి తన శక్తి సామధ్యలు ఎంత వరకు సరిపోతాయి అన్న ప్రయత్నానికి ట్రయల్ గా తాను ‘బాహుబలి’ తీసాను అని వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి. 

మహాభారత కథలో ఉండే భావోద్వేగాలు మరేకథలోనూ ఉండవని అందుకే మనం ఎన్నిసార్లు విన్నా చదివినా మహాభారతం బోర్ గా ఉండదని అంటూ తన ఆలోచనల ప్రకారం మహాభారతాన్ని సినిమాగా తీయగలిగితే ప్రపంచంలో గొప్ప సినిమాగా మహాభారత సినిమా మారుతుందని అందుకే తాను ఎదో ఒకరోజు కనీవిని ఎరగని బడ్జెట్ తో మహాభారతం తీస్తానని అయితే ప్రుస్తుతానికి అది ఎప్పుడూ అన్నది ఇప్పుడు చెప్పలేనని అన్నాడు రాజమౌళి.

‘బాహుబలి2’ కథ విషయమై మార్పులు లేకపోయినా ఈ సినిమా గురించి తాను ఆలోచించవలసినవి చాల ఉన్నాయి అని దాదాపు 1 సంవత్సరం తరువాత ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి ప్రస్తుతం ప్రేక్షకులలో నడుస్తున్న ‘బాహుబలి’ క్రేజ్ అప్పటి వరకు ఉండదని తనకు తెలుసు అంటూ కామెంట్ చేసాడు రాజమౌళి. అందువల్లనే ‘బాహుబలి2’ ను కూడ చాల డిఫరెంట్ గా తీయడమే కాకుండా ఆ సినిమాను కూడ డిఫరెంట్ గా ప్రమోట్ చేయడానికి తాను నిశ్చయించుకున్నానని దానివల్ల ‘బాహుబలి 2’ పూర్తి అయి విడుదల కావడానికి సంవత్సరం పైనే పట్టినా ఆశ్చర్యం లేదు అంటూ విశ్లేషణ చేసాడు రాజమౌళి..



మరింత సమాచారం తెలుసుకోండి: