మెగా కుటుంబ హీరోల సినిమాలకు సంబంధించిన విషయాలను మెగా అభిమానులు తమ కుటుంబ విషయాలకంటే ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు అందువల్లనే మెగా కుటుంబ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాను సూపర్ హిట్ చేయడానికి మెగా అభిమానులు పడే తాపత్రయం వర్ణనాతీతం.

రామ్‌ చరణ్‌, శ్రీను వైట్లల సినిమాకు ఇప్పటి దాకా టైటిల్ ప్రకటించకుండా సినిమా షూటింగ్ నడిపించినా చిరంజీవి పుట్టినరోజు మరి కొద్ది రోజులలో రాబోతున్న నేపధ్యంలో ఈసినిమా టైటిల్ ఖరారుకు దర్శకుడు శ్రీనువైట్ల మెగా కాంపౌండ్ తో చాల సీరియస్ గా చర్చలు జరుపుతున్నాడని టాక్. గతంలో ఈసినిమాకు 'మై నేమ్‌ ఈజ్‌ రాజు', 'నా పేరే రాజు' అనే పేర్లతో పాటు  ‘బ్రూస్‌లీ' అనే టైటిల్‌ కూడప్రచారంలోకి వచ్చింది. 

ఈసినిమాలో చరణ్ ‘బ్రూస్ లీ’ మాదిరిగా ఫైట్స్ చేసే స్టంట్ మాస్టర్ గా కనిపిస్తాడు కాబట్టి ఈసినిమాకు ఈ టైటిల్ బాగుటుంది అని  పై చరణ్‌ మొగ్గు చూపినట్టు వార్తలొచ్చాయి. ఇందులో స్టంట్‌మ్యాన్‌గా నటిస్తున్న రామ్‌ చరణ్‌ 'బ్రూస్‌లీ' మాదిరిగా ఫైట్లు చేస్తుంటాడట. అందుకే టైటిల్‌ కూడా అదే పెట్టేస్తే బాగుంటుందని చాలాకాలం భావిస్తూ వచ్చారు. అయితే ఈ టైటిల్ వద్దని చాలామంది మెగా అభిమానులు చరణ్ దృష్టికి తీసుకు రావడంతో రామ్ చరణ్ తన అభిమానుల కోరిక మేరకు వేరే టైటిల్స్ మీద దృష్టి పెట్టాడు.

అయితే ఎంత ఆలోచించినా ఈసినిమా కథకు అన్నివిధాలా ‘బ్రూస్ లీ’ అన్న టైటిల్ మాత్రమే సరిపోతుంది అని రామ్ చరణ్ ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్. దీనితో మెగా కాంపౌండ్ చిరంజీవి రామ్ చరణ్ అభిమాన సంఘాలకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులను పిలిపించి ఈసినిమాకు ‘బ్రూస్ లీ’ అన్న టైటిల్ పెడితే చరణ్ అభిమానులకు ఉన్న అభ్యంతరాలను కూలంకషంగా వినడానికి మెగా కాంపౌండ్ నిశ్చయించుకుంది అని వార్తలు వస్తున్నాయి. ఏదోవిధంగా తన అభిమానులను  ఒప్పించి ఈసినిమాకు ‘బ్రూస్ లీ’ అన్న టైటిల్ ను ఒకే చేయించు కోవాలాని రామ్ చరణ్ గట్టి పట్టుదలమీద ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: