టాలీవుడ్ యంగ్ హీరోలలో  కళ్యాణ్ రామ్ చాలా సంస్కారవంతంగా ఉంటాడని అతడిని దగ్గరనుండి చూసిన చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఈ నందమూరి యువ హీరోకు చెడు అలవాట్లు నేర్పిన ఒక టాప్ డైరెక్టర్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సురేంద్ర రెడ్డిని టాలీవుడ్ కు పరిచియంచేసిన ఘనత కళ్యాణ్ రామ్ ది ‘అతనొక్కడే’ సినిమా ద్వారా సురేంద్ర రెడ్డిని కళ్యాణ్ రామ్ టాలీవుడ్ కు పరిచియం చేసాడు. 

ఈ సినిమా హీరోగా కళ్యాణ్ రామ్ కు, దర్శకుడిగా సురేంద్రరెడ్డికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసినిమా తరువాత సురేంద్రరెడ్డి కళ్యాణ్ రామ్ కు ఆప్తమిత్రుడిగా మారిపోయాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేంద్రరెడ్డి కళ్యాణ్ రామ్ గురించి మాట్లుడుతూ తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అంటే తనకు విపరీతమైన అభిమానం అని చెపుతూ అనుకోకుండా తానూ కళ్యాణ్ రామ్ కు ఒక చెడు అలవాటు నేర్పాను అని అంటూ ఒక ఆసక్తికర  విషయాన్ని బయట పెట్టాడు.

‘అతనొక్కడే’ సినిమా ప్రారంభానికి ముందు సిగరెట్ వాసన కూడ కళ్యాణ్ రామ్ కు తెలియదని అయితే ఆ సినిమాలోని కళ్యాణ్ రామ్ పాత్ర అవసరం రీత్యా తానూ కళ్యాణ్ రామ్ కు సిగరెట్ అలవాటుచేసి అతడితో సిగరెట్ తాగే సన్నివేశాలు చిత్రీకరించానని అయితే ఆ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ సిగరెట్ కు అలవాటుపడి సిగరెట్ అడిక్ట్ గా మారిపోయాడని అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు సురేంద్రరెడ్డి. 

అయితే మంచి అలవాట్లు ఉన్న కళ్యాణ్ రామ్ కు తన వల్ల సిగేరేట్ తాగే అలవాటుకు లోనుకావడం తనను ఎప్పుడు భాధిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు సురేంద్రరెడ్డి. అయితే అటువంటి ఈ ప్రాణ స్నేహితులు ఇద్దరూ కలిసి చేసిన ‘కిక్ 2’ సినిమా నిర్మాణంలో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడం వెనుక అసలు కారణాలు ఏమిటి అన్నది ఈ ప్రాణ స్నేహితులకే తెలియాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: