తెలుగు చిత్ర సీమలో నటసార్వభౌముడిగా  ఎన్టీరామారావు మకుటం లేని మహరాజులా వెలిగిపోయారు. సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో తాను మాత్రమే పోషించే విభిన్నమైన పాత్రలు వేసి తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేశారు. రాముడు అన్నా.. కృష్ణుడు అన్నా బహుషా ఎన్టీఆర్ లాగే ఉంటారేమో అన్న చందంగా ఉండేది. ఈయన అంటే ఎంత అభిమానమంటే.. కొంత మంది ఇండ్లల్లో కూడా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని పూజించిన వాళ్లు కూడా ఉన్నారట. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అప్పటి వరకు రాజకీయం అంటే తెలియని ప్రతి ఒక్కరికీ రాజకీయ పాఠాలు నేర్పించారు.

రాజకీయాల్లో కూడా ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇప్పుడు ఈదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ఈయన కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడలేని అభిమానులను సంపాదించారు.... టోటల్ గా పవనీజం అనే పదాన్నే సృష్టించారు ఫ్యాన్స్. ఆయన మాదిరిగానే ఓ కొత్త పార్టీ ప్రజల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు జనసేన అధ్యక్షులుగా సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర పోషిస్తారని, రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతారని అంటున్నారు.  విచిత్రమేమిటంటే... అప్పట్టో అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు ‘సర్ధార్ పాపారాయుడు’ సినిమా తీశారు. తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.

సర్దార్ పాపారాయుడు లో ఎన్టీరామారావు, శ్రీదేవి


ఇప్పుడు పవన్ కూడా ‘సర్ధార్’ సినిమా తీస్తున్నాడు మరి తర్వాత ఈయన కూడా ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..? ప్రస్తుతం పవన్ కళ్యాన ‘సర్ధార్ ’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆ మద్య పవన్ గుబురుగా గడ్డం పెంచి కనిపించాడు వాస్తావానికి ‘సర్ధార్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గడ్డంతో నటించే ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాటిని షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని సమాచారం. అయితే సర్ధార్ పాపారాయుడు సినిమాలో కూడా ఎన్టీఆర్ చివరి సన్ని వేశాల్లో గుబురుగా గడ్డం పెంచుకొని కనిపిస్తాడు. అదే విధంగా సర్దార్ చిత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పనికి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: