ప్రస్థుతం ‘సర్దార్’ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను చేయలేని పని జూనియర్ ఎన్టీఆర్ చేస్తూ ఉండటం పవన్ ను ఆశ్చర్య పరిచింది అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పవన్ కు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు కూడ షాకింగ్ గా మారింది అని టాక్.  జూనియర్ తన కెరియర్ లో ఎప్పుడూ చేయని సాహసం చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లోఎప్పుడూ రీమేక్ సినిమా కథల పట్ల ఆ శక్తి చూపెట్టలేదు. అయితే ఈసారి తన పద్ధతి మార్చుకుని ఒక రీమేక్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. క్రితం సంవత్సరం కోలీవుడ్ లో విడుదలై సంచలనాలు సృస్టించిన హీరో విజయ్ ‘కత్తి’ సినిమాకు అనేక ఆలోచనలు చేసిన తరువాత జూనియర్ ఈ రీమేక్ లో నటించడానికి తన అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం లండన్ లో ఉన్న జూనియర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన ఉంటుంది అని టాక్. 

జూనియర్ నిర్ణయంతో ఈసినిమాను కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన మురుగదాస్ ప్రస్తుతo మన తెలుగు రాష్ట్రాలలోని పరిస్థుతులకు అనుగుణంగా ఈ ‘కత్తి’ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని టాక్. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద భూములు తీసుకున్న నేపధ్యాన్ని కూడ జతకలిపి ఈ ‘కత్తి’ స్క్రిప్ట్ కు పదును పెడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను మురుగదాస్ దగ్గర గతంలో సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడానికి లైన్ క్లియర్ అవడమే కాకుండా మురుగదాస్ ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. 

అయితే ఇప్పటికే ఈసినిమా రీమేక్ రైట్స్ నిర్మాత ఠాగూర్ మధు దగ్గర ఉన్న నేపధ్యంలో అతడితో కలిసి దిల్ రాజ్ నిర్మించబోతున్నాడు అని తెలుస్తోంది. జూనియర్ కు ప్రస్తుతo తెలుగుదేశం పార్టీతో సరైన సంబంధ బాంధవ్యాలు లేని నేపధ్యంలో రాజధాని భూముల వ్యవహారంలో ఈ తీయబోతున్న సినిమాలో కొన్ని పవర్ ఫుల్ పంచ్ లు ఉండబోతున్నాయని టాక్. ఏది ఎలా ఉన్నా పవన్ చేయలేనిది జూనియర్ చేస్తున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: