పవన్ అత్త నడియకు సంబంధించిన ఒక సీక్రెట్ ను రామ్ చరణ్ బయట పెట్టాడు. ప్రస్తుతం చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నదియా నటిస్తోంది అన్న విషయాన్ని అధికారికంగా తెలపడమే కాకుండా బ్యాంకాక్ షెడ్యూల్‌లో నదియా చరణ్ తో తీయించుకున్న సేల్ఫీ ఫోటోను కూడా పోస్ట్ చేసాడు. అయితే ఇప్పటి వరకు ఈసినిమాలో నదియా నటిస్తోంది అన్న విషయం ఎందుకు రహస్యంగా ఉంచారు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. 

మొదట్లో ఈసినిమాలో చరణ్ తల్లి పాత్రను వేరే నటి చేస్తోంది అన్న పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు నదియా  రంగంలోకి దిగడంతో చరణ్ తల్లిగా ఈమె నటిస్తోందా ?లేదా మరో కీలక పాత్ర కోసం ఈమెను ఎంపిక చేసారా అంటూ చరణ్ అభిమానులు చర్చలు జరుపు కుంటున్నారు.

ప్రభాస్ తల్లిగా పవన్ అత్తగా నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నదియా ‘దృశ్యం’ సినిమాలో పోలీసు ఆఫీసరుగా నటించి సంవత్సరం దాటిపోయినా ఇప్పటి వరాకు మరే సినిమాలోను నటించలేదు. ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తరువాత చరణ్ సినిమాలో సందడి చేయబోతోంది. ఈసినిమాలో చరణ్ చెల్లెలుగా గ్లామర్ హీరోయిన్ క్రితి కర్భంద నటిస్తూ ఉండటం ఒక షాకింగ్ అనుకుంటే మరొక షాకింగ్ న్యూస్ గా నదియా వచ్చి చేరింది. 

దీనితో ఇటువంటి సంచలనాలు ఇంకా ఈసినిమాలో ఎన్ని ఉన్నాయో అని చరణ్ అభిమానులు ఊహించు కుంటున్నారు. ఈనెల రాబోతున్న చిరంజీవి షష్టిపూర్తి నాడు అధికారికంగా ఈసినిమా టైటిల్ ప్రకటించబోతున్నారు. అందరూ అనుకున్నట్లుగానే చిరంజీవి ఈసినిమాలో అతిథి పాత్ర చేయడం ఖాయం అయితే చరణ్ మళ్ళీ తన ‘మగధీర’ రికార్డులను రిపీట్ చేయబోతున్నాడు అనుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: