సాధారణంగా మన టాలీవుడ్‌ హీరో ఓరియెంటెడ్‌ ఇండస్ట్రీ! ముందుగా హీరోకు నచ్చే కథ చెబుతారు. ఆ తర్వాత.. హీరోకు సూటయ్యే, హీరోకు ఆమోదం అయ్యే మిగిలిన క్యాస్టింగ్‌ను ఎంపిక చేస్తారు. ఇప్పుడిప్పుడే కొందరు దర్శకులు మాత్రం.. పైచేయి సాధించి.. తాము కథలు తయారుచేసుకుని.. దానికి తగిన హీరోలను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా నితిన్‌ - త్రివిక్రం శ్రీనివాస్‌ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా స్టన్నింగ్‌ గా ఉన్నాయి. ఈ చిత్రంలో కథ ఫైనలైజ్‌ చేయడానికంటె ముందు త్రివిక్రం హీరోయిన్‌గా సమంత అని ఫిక్సయిపోయాట్ట. ఆ తర్వాతే కథకు తుదిమెరుగులు దిద్ది.. సమంత పక్కన ఈ కథలో ఎవరు సూటవుతారో.. అనే అన్వేషణలో చివరికి నితిన్‌ ను ఒకే చేసుకున్నాట్ట. త్రివిక్రం కు సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 


త్రివిక్రం ఇప్పటికే సమంతతో రెండు చిత్రాలు చేశారు. ఆమె పెర్ఫార్మెన్స్‌కు చాలా కితాబులు కూడా ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌ బాగా ట్యూన్‌ అయినట్లు తేలిపోయింది. దానికి తగినట్లుగానే తాజా పుకార్లు కూడా ఉంటున్నాయి. ముందుగా సమంతను ఫైనలైజ్‌ చేసుకున్న తర్వాతే.. త్రివిక్రం హీరో గురించి ఆలోచించారని చెబుతున్నారు. ఇటీవలి పరిణామాలు కూడా ఆ వాదనకు సరిపోయేలాగానే ఉన్నాయి. ఎందుకంటే.. త్రివిక్రం ఎవరితో చేయబోతున్నారనేది ఒక పట్టాన తేలలేదు. రకరకాల పేర్లు వినిపించాయి. చిట్టచివరికి హీరో నితిన్‌ అనేది ఖరారైంది. ఆయనతో ఇదివరకు చిత్రాలు తీసిన నిర్మాతే దీనిని కూడా రూపొందస్తున్నారని తెలిసింది. 


త్రివిక్రం ప్రస్తుతం సమంత మేనియాలో ఉన్నారని.. అందుకే స్క్రిప్టు సిద్ధమైన తర్వాత గానీ క్యాస్టింగ్‌ జోలికెళ్లే అలవాటు లేని ఆయన.. కథకంటె ముందు నాయికను ఫిక్స్‌ చేసేశారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. నితిన్‌కు మాత్రం సమంత సరసన చేసే ఛాన్సు దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: