1990 ప్రాంతాలలో ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన కోదండరామిరెడ్డి ఎన్నో హిట్ సినిమాలను తీసాడు. అతడు దర్శకత్వం వహించిన 93 సినిమాలలో 27 సినిమాలు మెగా స్టార్ చిరంజీవితో చేయడం ఒక రికార్డు. చిరంజీవి టాప్ హిట్స్ లో చాలామటుకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించినవే.

ఆ తరువాత టాలీవుడ్ లో వచ్చిన మార్పులతో కోదండరామిరెడ్డి తన హవాను కోల్పోయాడు. ప్రస్తుతరం అభిరుచులకు అనుగుణంగా ఇతడు సినిమాలు తీయలేడని టాప్ నిర్మాతలే కాకుండా ప్రస్తుత తరం టాప్ హీరోలు కూడ కోదండరామిరెడ్డి వైపు చూడటంలేదు. అతడి వారసుడిగా యంగ్ హీరో వైభవ్ ను కోదండరామిరెడ్డి పరిచయం చేసినా అతడికి తెలుగులో చెప్పుకోతగ్గ అవకాశాలు రావడంలేదు.

అయితే ఈమధ్య వైభవ్ నటించిన తమిళ సినిమా ‘పాండవులలో ఒక్కడు’ పేరుతో డబ్ చేయబడింది. ఈ సినిమా ప్రమోషన్ గురించి కోదండరామిరెడ్డి తన కొడుకుతో ఇరు రాష్ట్రాలలోని ధియేటర్ల వద్దకు వెడుతూ రాజమండ్రిలో ఈసినిమా ప్రదర్శిస్తున్న ఒక ధియేటర్ లో తనను కలిసిన మీడియా వారితో మాట్లాడుతూ కోదండరామిరెడ్డి తన మనసులోని వింత కోరికను బయట పెట్టాడు.

తాను 100వ సినిమాకు రీచ్ కావడానికి మిగిలి ఉన్న 7 సినిమాలను రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసి తన 100వ సినిమాను మాత్రం చిరంజీవిని హీరోగా పెట్టి తానే నిర్మించి దర్శకత్వం వహిస్తాను అంటూ ఒక అద్భుతమైన పగటి కలను మీడియా ముందు వ్యక్త పరిచాడు. అయితే ఆ మాటలు విని మీడియా ఆశ్చర్య పోయింది అని టాక్. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో చిరంజీవికే తెలియని పరిస్థుతుల  నేపధ్యంలో కోదండరామిరెడ్డి పగటి కల నెరవేరేది ఎప్పుడో అని మీడియా ప్రతినిధులు సెటైర్లు వేసుకున్నారని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: