తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య బాబుతో రెండు హిట్ సినిమాల్లో నటించి న బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టె అంటే అందరికీ తెలిసిన విషయమే.. ఈ అమ్మడికి సినిమాల్లో వచ్చిన పబ్లిసిటి కంటే సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటినే ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే ఈ అమ్మడు బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాలు ఎక్కువే చేస్తూ కుర్రకారుకి హిట్ పుట్టిస్తుంది.  ఇప్పుడు ఈ అమ్మడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయ్యింది.

సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాళీ చిత్రంలో రాధికా ఆప్టేకు నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాని తమిళ నిర్మాత కలైపులి థాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఇప్పటివరకు చాలా మంది పేర్లు వినిపించినా చివరికి బాలీవుడ్ బ్యూటీ  రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాధిక ఆప్టే మాట్లాడుతూ.. రజనీకాంత్‌‌కు మించిన గొప్ప నటుడు ఎవరూ లేరని తెలిపింది. ఆయనను కలుసుకునేందుకు చాలా ఆతృతగా ఉన్నానని చెప్పింది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్


దర్శకుడు రంజిత్ చెప్పిన కథ నచ్చిందని తను నటిస్తున్న విషయాన్ని కన్‌ఫార్మ్ చేసింది. కథతోపాటు నా పాత్ర సాగుతుంది. తమిళం నేర్చుకోవడం, మాట్లాడటం నాకు పెద్ద సవాల్ అంటూ తెలిపింది. వాస్తవానికి ఈ సినిమా కోసం దీపికా పడుకొనే, కత్రినా కైఫ్, విద్యాబాలన్‌లు చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా చివరికి ఆ అదృష్టం రాధికా ఆప్టేకు దక్కిందన్నమాట. అయితే ఇందులో రజనీకాంత్‌కు హీరోయిన్ ఉండదు, ఆయన డాన్ పాత్ర చేస్తున్నాడు. అంటే ప్రభాస్ బిల్లా సినిమాలో నమితలాగా రజనీ పక్కన ఉంటూ తన అందచందాలను వడ్డిస్తుందన్నమాట. అట్టకత్తి, మద్రాస్ చిత్రాలను రూపొందించిన రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: