మరో సౌత్ మూవీ వంద కోట్ల మార్క్ క్రాసైంది. విజయ్-కాజల్ హీరోగా మురుగదాసు తెరకెక్కించిన ‘తుపాకి' చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం కలెక్షన్ల పరంగా 100 కోట్లు దాటింది. ఈ విషయాన్ని చిత్రయూనిటే స్వయంగా ప్రకటించింది. ‘తుపాకి చిత్రం 100 కోట్లు క్రాసైంది. కోలీవుడ్ లో ఇలాంటి ఫీట్ సాధించిన రెండో సినిమా'.. అంటూ మురుగదాస్ ట్విట్టర్లో తెలిపాడు. సినిమాను ఇంద పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మురుగదాస్ థాంక్స్ తెలిపాడు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు రానురాను భారీ కలెక్షన్లనే సాధిస్తోంది. ఫస్ట్ డే 9.25 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తమిళ బాక్సాఫీసు వద్ద తొలి మూడు రోజులు 22.15 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈచిత్రం తొలి ఆరు రోజుల్లో 65.25 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళ నాడులోనే ఈ చిత్రం 45 కోట్లు వసూలైంది. ఇప్పటి వరకు మొత్తంగా 100 కోట్ల మార్కు దాటి కొత్త రికార్డు సాధించింది. తమిళ చిత్రాల మార్కెట్లో 100 కోట్లు దాటిన రెండో సినిమాగా 'తుపాకి'ని చెప్పుకోవచ్చు. గతంలో రజనీకాంత్ మూవీ రోబో వంద కోట్లు క్రాసైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: