“టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ఒక బాహుబలి. రెండోవది రుద్రమదేవి.” ఈ వార్తలు గత రెండు సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఇందులో ఒక భారీ ప్రాజెక్ట్ అయిన బాహుబలి రిలీజ్ అయి..బాక్సాపీస్ వద్ద రచ్ఛ రచ్ఛ చేసి వెళ్ళింది. ఇక రుద్రమదేవి విషయం ఓ కొలిక్కి వచ్చేలా లేదు.

ఇప్పటికే పదుల సంఖ్యలో రిలీజ్ వాయిదాలు పడుకుంటూ వచ్చింది.గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవటం, తరవాత వాయిదా పడటం వంటి విషయాలు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు.

హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ట్రైలర్,పోస్టర్స్‌తో అన్ని విధాలా అంచనాలు పెంచేసిన ఈ సినిమా, ఈ మధ్యే ప్రమోషన్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువవుతోంది. ఇక సెప్టెంబర్ 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, మరోసారి వాయిదా పడి తిరిగి సెప్టెంబర్ 17న, 24న అంటూ డేట్స్ వినిపిస్తున్నాయి.

బయ్యర్ల దగ్గర నుండి సమస్యలు తలెత్తడంతో రిలీజ్ డేట్స్ వాయిదాలు పడుకుంటూ వస్తుంది. అయితే ఇప్పటికే బిజినెస్ ని కన్ ఫర్మ్ చేసుకున్న బయ్యర్స్..రుద్రమదేవి వాయిదాల కారణంగా మూవీపై హైప్ క్రియేట్ తగ్గతుంది. ఇలాగయితే అగ్రిమెంట్ ని రివైజ్ చేయాలి. రేట్లు తగ్గించాలి అంటూ గుణశేఖర్ వెంట పడుతున్నారంట. దీంతో గుణశేఖర్ ఎంత త్వరగా ఈ మూవీని రిలీజ్ చేస్తే, అంత మంచిది అనుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: