పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ అక్కడ పనిచేసిందంటూ ప్రజల్లో తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. అంటే ఆవేశంతో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాటలకు టిడిపి ప్రభుత్యం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

కూసింత సినిమా గ్యాప్ లో పవన్ కళ్యాణ్ వచ్చిన చేసిన కొద్ది హంగామాకే గవర్నమెంట్ కంగారు పడితే, పవన్ ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటే వారి భవిష్యత్ బంగారు మయం అవుతుందంటున్నారు రాజధాని ప్రాంత ప్రజలు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రాజధాని ప్రాంతంలోని 3200 ఎకరాలకు చెందిన రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించటం తెలిసిందే.ఈ నేపథ్యంలో భూసేకరణ చేపట్టొద్దని ట్విట్టర్ లో కోరిన పవన్.. ఆ తర్వాత ఏపీ మంత్రుల వ్యాఖ్యలతో రాజధాని ప్రాంతంలో పర్యటించటం తెలిసిందే.

ఈ సందర్భంగా రైతులకు ఇష్టం లేకుండా భూములు ఎట్టిపరిస్థితుల్లో సేకరించొద్దంటూ విస్పష్టంగా పవన్ ప్రకటించారు. ఒకవేళ భూసేకరణ విషయంలో ఏపీ సర్కారు కానీ ముందుకెళితే తాను ధర్నా చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే.. భూసేకరణ విషయంలో దూకుడు ప్రదర్శించిన ఏపీ సర్కారు.. పవన్ హెచ్చరిక తర్వాత ఆ అంశం మీద నిర్ణయం తీసుకోకపోవటం గమనార్హం.

ప్రస్తుతానికి భూసేకరణ పనులు చేపడుతున్నా, పవన్ వార్నింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఎటువంటి అలజడి ప్రభుత్వం తరుపునుండి లేదంట. పవన్ కళ్యాణ్ సూచించిన ప్రాంతంలో ఎటువంటి హడావిడి చేయకుడదు, సమయం చూసి అడుగు వేయండి అంటూ స్వయంగా ముఖ్యమంత్రి మున్సిపల్ అధికారులకు చెప్పిన మీదట ఆ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియను ఆపినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయటం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: