ఈ మద్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు బాగానే వస్తున్నాయి.. వాటికి తగ్గట్టు గానే కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సినిమాలు బాగానే వచ్చాయి.  తెలుగు, తమిళంలో పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి బిజినెస్ చేసి అందరినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచాయి. గతంలో సౌత్ ఇండియాలో సినిమాలు తీస్తే మహా అంటే ఇరవై కోట్లతో సినిమా అంటే అదే భారీ బడ్జెట్ సినిమా అనుకునే వారు కానీ ఆ స్థాయి మారిపోయింది. ఇప్పుడు వంద కోట్లు..కామన్ అయిపోయింది. తాజాగా రోబో,బాహుబలి,పులి లాంటి సినిమాలు వంద కోట్లకు పైగా పెట్టి తీశారు. ఇక రోబో 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.. ఈ మద్య విడుదలైన బాహుబలి చిత్రం రెండు వందల కోట్లు పెట్టి తీయగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి దాదాపు  500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది.  ఇక వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన సౌత్ లో డజనకు పైగా ఉన్నాయి.

వాటి వివరాలు ఒక్కసారి చూద్దామా..!!


బాహుబలి :


 బాహుబలి తెలుగు, తమిళం, మళయాలం, హిందీలో విడుదలై ఇప్పటి వరకు దాదాపు 600 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. సినిమా ఇంకా రన్ అవుతోంది. 


రోబో


రజనీకాంత్ నటించిన రోబో చిత్రం తెలుగు, తమిళం, హిందీలో విడుదలై ఓవరాల్ గా రూ. 289 కోట్ల గ్రాస్ సాధించింది. 


శంకర్  ‘ఐ' చిత్రం


శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' మూవీ తెలుగు, తమిళం, హిందీలో విడుదలై రూ. 239 కోట్ల గ్రాస్ సాధించింది. 


శివాజీ


రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ మూవీ తెలుగు, తమిళం, హిందీలో విడుదలై రూ. 155 కోట్ల గ్రాస్ సాధించింది 


మగధీర


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర' తెలుగు, తమిళం, మళయాలంలో విడుదలై దాదాపు 150 కోట్ల గ్రాస్ సాధించింది. 


అత్తారింటికి దారేది

 

పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం రూ. 131 కోట్ల గ్రాస్ సాధించింది. 


సింగం 2


సూర్య నటించిన సింగం 2 చిత్రం దాదాపు 122 కోట్ల గ్రాస్ సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: