మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇంచుమించు చివరి అంకానికి చేరుకుంది. చరణ్ రకుల్ ప్రీత్ లపై చిత్రీకరించవలసిన రెండు పాటలు మినహా ఈసినిమా షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది అని అంటున్నారు. ఈసినిమాలో చిరంజీవి 15 నిముషాల అతిథి పాత్రలో కనిపించబోతూ ఉండటంతో చిరంజీవి పాత్రకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది అని టాక్. ఈ వ్యవహారాలు అన్నీ త్వరలో ముగించుకుని ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను వచ్చే నెల మధ్యలో ఘనంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలయ్యాయని తెలుస్తోంది. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాను నిర్మిస్తున్న నిర్మాత డివివి దానయ్యతో చరణ్ ఒక మిడ్ నైట్ హంగామా మాస్టర్ ప్లాన్ రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ‘బాహుబలి’ మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమాల కోసం ఓవర్సీస్ లోనే కాకుండా ఇరు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలో అనేక ప్రీమియర్ షోలు వేసినట్లుగా చరణ్ నటిస్తున్న సినిమాకు కూడ అత్యధిక స్థాయిలో ప్రీమియర్ షోలు వేసి ఏదోవిధంగా మహేష్ ‘శ్రీమంతుడు’ రికార్డులను బ్రేక్ చేయడానికి ఇప్పటి నుంచే రామ్ చరణ్ గట్టి పధకాలు రచిస్తున్నట్లు టాక్. 

చిరంజీవి అతిథి పాత్రలలో ఈసినిమాలో కనిపించబోతు ఉండటంతో చిరంజీవి ఇమేజ్ కూడ ఈ ప్రీమియర్ షోల కలెక్షన్స్ కు ఉపయోగ పడుతుందని చరణ్ అంచనా అని అంటున్నారు. దాదాపు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పబ్లిసిటీని కూడ ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ స్థాయిలో అక్టోబర్ 1వ తారీఖు నుండి మొదలు పెట్టి రెండు వారాల పాటు బుల్లితెర పై హోరెత్తించాలని చరణ్ ఎత్తుగడ అని అంటున్నారు. 

దసరా పండగకు వస్తుంది అనుకున్న అఖిల్ సినిమా వాయిదా పడుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో దసరా ముందు ఆ తరువాత విడుదలయ్యే భారీ చిత్రం ఇది ఒక్కటే కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈసినిమాను విడుదల చేసి ‘శ్రీమంతుడు’ రికార్డులకు గండి కొట్టాలని చరణ్ ప్లాన్ అని అంటున్నారు. మరి ఈ మిడ్ నైట్ హంగామా చరణ్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: