నాని, లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్లుగా రాబోతున్న మూవీ 'భలే భలే మగాడివోయ్'. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా కొద్ది గటల క్రితం సెన్సార్ కార్యక్రమాన్ని ముగించుకుంది. క్లీన్ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ వారు 'యు' సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు సినిమా చాలా ఫ్రెష్ గా ఉందని చిత్ర యూనిట్ ను ప్రశంసించారట. సాధారణంగా నాని సినిమాలకు 'యు' సర్టిఫికెట్ రావడం గొప్ప విషయమేమీ కాదు కాని మారుతి డైరెక్ట్ చేసిన సినిమాలకు అతి తక్కువ సినిమాలకు కేవలం 'యు' వచ్చింది.

 

కామెడీకి కాస్త రోతని జోడించి మారుతి మొదట్లో రెండు మూడు సినిమాలు హిట్ కొట్టాడు. అప్పుడు ఫ్యామిలిస్ అంతా మారుతి మీద కాస్త కారాలు మిరియాలు నూరారు కూడా అందుకే మారుతికి కూడా చిన్న గా పంథాని మార్చుకుని సినిమాలు తీస్తున్నాడు. అయితే స్టార్స్ ని బట్టి సబ్జెక్ట్ ఉంటుంది అన్నట్టుగా మారుతి ఎప్పుడైతే నానితో సినిమా అని ఎనౌన్స్ చేశాడో సినిమా కచ్చితంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్. ఇక వదిలిన టీజర్లు, ట్రైలర్లలో కూడా సినిమాకు ఎక్కడా వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడ్డాడు మారుతి.

 

భలే భలే మగాడివోయ్ లో నాని, లావణ్య :

 

 రిలీజ్ అయిన ఆడియో కూడా మంచి టాక్ సొంతం చేసుకుని శ్రోతలను అలరిస్తుంది. అంతేకాదు దర్శక ధీరుడు రాజమౌలి భలే భలే మగాడివోయ్ ట్రైలర్ చూసి ట్రైలర్ అంటే ఇలా ఉండాలని ఎప్పుడైతే నాని సినిమా గురించి పొగడటం మొదలెట్టాడో సినిమాకు మంచి బూస్టప్ వచ్చింది. గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్లో వస్తున్నా ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు బన్ని వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అటు హీరో నానికి, ఇటు దర్శకుడు మారితికి మాంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. మరి మెమొరీ నిల్ తో నాని చేసే ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ శుక్రవారం దాకా వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: