బుల్లితెరపై అందాల బొమ్మ‘ చిన్నారి పెళ్లి కూతురు’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అవికా గోర్. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది.  తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అమాయ‌క‌మైన మొహం, హుషారైన న‌ట‌న‌, చ‌లాకీ చూపులు వెర‌సి - మ‌నింటి అమ్మాయేనేమో అనిపిస్తుంది.

తాజాగా ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్ తో మళ్లీ నటించింది..ఈ సినిమా కూడా మంచి కామెడీ ట్రాక్ తో పాజిటీవ్ టాక్ రావండంతో ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీ బాగానే కలిసి వచ్చిందని అంటున్నారు.తాజాగా అవిక తన మనసులో మాట చెప్పింది.

సినిమా చూపిస్త మావ చిత్రంలో రాజ్ తరుణ్,అవికా గోర్


సాధారణంగా ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ సినిమా లో ఈ అమ్మడికి ఇద్దరు హీరోలతో పెళ్లి అయితే బాగుండే... అనిపించేదట.. చిన్నపుడు షాహిద్ కపూర్ తెగ ప్రేమించిదట.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనుష్ ని పెళ్లి చేసుకోవాలనిపించిందట.. మరి బ్యాడ్ లక్ ఈ ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. అయినా ఇప్పుడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటోంది చిన్నది అవికాగోర్.



మరింత సమాచారం తెలుసుకోండి: