అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ పోస్టర్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మండే అగ్నిగుండెం లాంటి బంతిని పట్టుకుని ఆకాసం కేసి చూస్తున్న అఖిల్ ని చూసి అందరు షాక్ అయ్యారు. అక్కినేని అభిమానులకు నాగ్ బర్త్ డే సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. అయితే నిన్న సెలబ్రిటీస్ అందరు అఖిల్ సినిమా పోస్టర్ గురించి తమ విశెష్ ని తెలిపి అభినందించారు. అయితే ఏదైనా కొత్త విషయం వస్తే దాని గురించి తన విచిత్రమైన స్పందనను తెలియచేసే వర్మ కూడా అఖిల్ గురించి హాట్ కామెంట్ చేశాడు.

అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇక స్టార్లుగా చెలామణి అవుతున్న అందరు పెట్టా బేడా సర్ధుకోవాల్సిందే అని మరో సంచలనానికి దారితీశాడు వర్మ. అంటే ఇది తను అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్ హార్ట్ అవుతారని వేరే ఎవరో చెప్పారు అని అంటున్నాడు. అయినా వర్మకు ఏదైనా విషయం నచ్చితే ఇక దాన్ని ఆకాశానికెత్తడం మాములే అని మనకు తెలుసు. ఇప్పుడు అఖిల్ పోస్టర్ తో ఒక్క హీరో అని కాదు మొత్తం ఏకంగా స్టార్ హీరోలందరికి షంటింగ్ ఇచ్చాడు. అయితే వర్మ మాటలు పట్టించుకునే వారు ఎంతమంది చెప్పండి.

 

అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ :

 

ఏమాట కామాట చెప్పుకోవాలి అంటే నిజంగానే అఖిల్ అక్కినేని తన ఫస్ట్ లుక్ తో అందరిని ఆశ్చర్యపడేలా చేశాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ లుక్ ని శివ సినిమాలో నాగార్జున లుక్ తో కూడా కొందరు పోలుస్తున్నారు. దాని గురించి మాత్రం వర్మ ఏం కామెంట్ చేయలేదు. వినాయక్ డైరక్షన్లో వస్తున్న అఖిల్ సినిమా శ్రేష్ఠ్ మూవీ బ్యానర్లో హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. థమన్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సయేష సైగల్ హీరోయిన్ గా చేస్తుంది.

 

మొత్తానికి అక్కినేని నాగార్జున రెండవ వారసుడిగా ఎట్టకేలకు తెరంగేట్రం ఇచ్చాడు అఖిల్. ఫస్ట్ లుక్ పోస్టరే ఇలా కేకలు పెట్టిస్తుంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అఖిల్ సినిమా డిశెంబర్లో విడుదలకు సిద్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: