రాజమౌళి కొడుకు కార్తికేయకు నాగార్జున తనయుడు అఖిల్ కు మధ్య చాలా సన్నిహిత సంభందాలు ఉన్నాయి. కొంత కాలంక్రితం అఖిల్ పై  కార్తికేయ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడ తీసాడు. అఖిల్ స్క్రీన్ లుక్ ఎలా ఉంటుంది అలాగే అతడి డాన్స్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అన్న  విషయం పై ఒక క్లారిటీ రావడానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ షార్ట్ ఫిలిమ్స్ నిర్మించారు.

 అప్పటి నుంచి వీరద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో నిన్న విడుదల అయిన అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రూపొందించడంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు అన్న వార్తలు వస్తున్నాయి `బాహుబలి` సినిమాకి సంబంధించిన ప్రతీ పోస్టర్ లోనూ మేఘాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు అఖిల్ సినిమా పోస్టర్ లోనూ ఇంచుమించు  అలాంటి మేఘాలే కనిపిస్తున్నాయి. ఇలా కనిపించడానికి కార్తికేయ ప్రభావమే అని అంటున్నారు. 

షోయింగ్ బిజినెస్ పేరుతో  కార్తికేయ ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు అన్న విషయమై ఇప్పటికీ వార్తలువచ్చాయి. సినిమాలకు సంబంధించి   పబ్లిసిటీ కంటెంట్ ని క్రియేటివిటీతో అందించడానికి కార్తికేయ కంపెనీ ఆ సినిమా దర్శక నిర్మాతలకు సలహాలు అందిస్తూ ఉంటుంది.  `మనం` `ఊహలు గుసగుసలాడే` `ఒక లైలా కోసం` `బాహుబలి` తదితర చిత్రాలకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ లోనూ పోస్టర్ల డిజైనింగ్ లోనూ కార్తికేయ సంస్థ తన సలహాలు అందివ్వడమే కాకుండా ఆ సినిమాల పోస్టర్లకు విడుదలకు ముందే క్రేజ్ ఎర్పడేలా కార్తికేయ షోయింగ్ బిజినెస్ సంస్థ పనిచేస్తోంది.  నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతున్న అఖిల్ టీజర్ ను కూడ  డిజైన్ చేసింది కార్తికేయ సలహాలతోనే  అని అంటున్నారు.

 ఈ వార్తలు ఇలా ఉండగా నాగార్జున రేపు తన పుట్టిన రోజునాడు హైదరాబాద్ లో తన అభిమానులకు అందుబాటులో ఉండడు అనే వార్తలు వస్తున్నాయి. నాగ్ తన భార్య అమలతో కలిసి  ఒక హాలిడే స్పాట్ లో తన  పుట్టిన రోజును జరుపుకుoటాడని టాక్. కాని రేపు అఖిల్ సినిమా టీజర్ తో పాటు నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ టీజర్ కూడ రిలీజ్ అవుతూ ఉండటంతో అక్కినేని అభిమానులకు ఇది పెద్ద పండుగే అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: