తెలంగాణ కాకతీయుల చరిత్రకు అద్దం పట్టే విధంగా దర్శక,నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు.  బాహుబలి సినిమాను రాజమౌళి ఎలా అయితే ప్రమోట్ చేసుకున్నాడో.. సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్. బహుబలి లాగా రుద్రమదేవి కూడా చారిత్రక నేపథ్యం గల సినిమా కావడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశపడ్డాడు.  


ఇక ఈ సినిమా ఏ మూహూర్తంలో మొదలు పెట్టారో కానీ అన్నీ అరిష్టాలే చుట్టుముడుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ విడుదలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. అప్పుడెప్పుడో జూన్ 26న విడుదల కావాల్సిన రుపద్రమదేవి క్వాలిటీకోసం అంటూ జూలై 10 అన్నాడు.  ఆ తేదీ అయిపోయింది సెప్టెంబర్ 4న అంటూ అనుష్కతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి తేదీ ప్రకటించాడు. 4న కూడా విడుదల కావటం లేదని సమాచారం. కారణాలేంటో చెప్పటానికీ లేదు,, వినటానికీ లేకుండా ఉంది రుద్రమ పరిస్థితి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 17 న విడుదల చేయాలని అనుకుంటున్నారట.

రుద్రమదేవి చిత్రం పోస్టర్


అదే సమయానికి సాయిధరమ్ తేజ్,మంచు విష్ణు తమిళ సినమా పులి అన్నీ ఒకే సారి రావడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడట గుణశేఖర్. వస్తుంది. తమిళ వెర్షన్ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. పోనీ తెలుగులో మొదట విడుదల చేసి తరువాత తమిళంలో విడుదల చేద్దామా అంటే అది తమిళ వెర్షన్‌కి దెబ్బడిపోతుంది. ఈ తేదీ మిస్సయితే నవంబర్ వరకు ఆగాల్సిందే. ఇని రోజులు లేటు తొందర ఇప్పుడెందుకని నవంబర్ వరకు ఆగుతాడా ఏంటీ?? విడుదల వాయిదా వేయడంపై సరైన కారణాలు చెప్పకపోవడంతో అనుష్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: