ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా విషయానికి పవర్‌స్టార్‌, ‘జనసేన’ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఒక న్యూ ట్విస్ట్ ఇచ్చాడు. ఈసమస్య పై ఎంతో మంది పవన్ ఎందుకు మాట్లాడటం లేదు అని అడగడం వల్ల కాబోలు ఆఖరికి ఈ విషయమై తన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మందు ఉంచాడు.

'గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీగారికి విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకి తగిలిన గాయాల్ని గతంలో వివరించాను. ఆయన అర్థం చేసుకున్నారు, అందుకే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే భావిస్తున్నా ఇప్పటికే ఆలస్యమైందని తెలుసు, కానీ దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకుని భావోద్వేగాలకు పోకుండా ఇంకొంతకాలం వేచి చూద్దాం. అప్పటికీ న్యాయం జరగని పక్షంలో దానిని ఎలా సాధించాలో ఆలోచిద్దాం' అంటూ తాను ఇప్పటికీ భారతీయ జనతాపార్టీ విధానాలకు అభిమానినే అన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేసాడు. 

నిన్న సాయంత్రం ఈ ట్వీట్‌ పవన్ పెట్టడం వెనుక మరో ఎత్తుగడ ఉందా అని విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఈరోజు ‘రక్షా భందన్’ పండుగ అయినప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ విషయమై జగన్ బంద్ పిలుపును ఇచ్చిన నేపధ్యంలో ఆ పిలుపుకు ప్రజల నుండి ముఖ్యంగా యువత నుండి సరైన స్పందన రాకుండా చేయడానికి వ్యుహాతత్మకంగా పవన్ ఈ ట్విట్ చేసి తన రాజకీయ అస్థిత్వాన్ని కొనసాగిoచు కోవడానికి ఈ ఎత్తుగడ వేశాడా అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. 

ఏది ఎలా ఉన్నా ప్రత్యేక హోదా పై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు అని విమర్శిస్తున్న వారికి పవన్ తన సమాధానంతో మరో ట్విస్ట్ ఇచ్చాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: