కన్నడ హీరో సుదీప్ కు ‘ఈగ’ సినిమా ద్వారా రాజమౌళి టాలీవుడ్ లో ఒక ప్రేత్యేక గుర్తిoపు తీసుకువచ్చాడు. ఈ సినిమా ఘన విజయం తరువాత టాలీవుడ్ లో చాలా అవకాసాలు వచ్చినా సుదీప్ వాటిని ఏమి ఒప్పుకోకుండా తన కన్నడ సినిమా రంగం పైనే శ్రద చూపెడుతున్నాడు. ఈ రోజు కన్నడ సినిమా రంగంలో సుదీప్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

అంతేకాకుండా దర్శకుడిగా కూడ సుదీప్ కన్నడంలో మంచి పేరు సంపాదించాడు. ఇప్పటివరకు 6 కన్నడ బ్లాక్ బస్టర్స్ కు సుదీప్ దర్శకత్వం వహించాడు. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను కన్నడంలో రీమేకే చేసి అక్కడ కూడ రికార్డులు సృస్టించాడు సుదీప్. అటువంటి ఈగ విలన్ ప్రస్తుతం రాజమౌళికి షాక్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. 

కన్నడ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సుదీప్ ఒక భారీ జానపద చిత్రాన్ని ‘బాహుబలి’ స్థాయిలో గ్రాఫిక్స్ మాయాజాలంతో దక్షిణాదికి సంబంధించిన అన్ని భాషలతో పాటు హిందీలో కూడ విడుదల అయ్యేలా ఒక భారీ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను మొదలుపెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. కన్నడ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్ ను ఈసినిమాకు పెట్టడానికి ఒక అంతర్జాతీయ  నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది అని టాక్. 

ఎంతోమంది అడుగుతున్నా ఎవరికీ పాత్రలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాజమౌళి సుదీప్ కు మాత్రం తన ‘బాహుబలి’ లో ఒక పాత్రను ఇచ్చి తన అభిమానాన్ని తెలియచేసాడు. అయితే సుదీప్ రాజమౌళి ‘బాహుబలి’ బడ్జెట్ ను షేక్ చేసే విధంగా అదే స్థాయిలో మరో గ్రాఫిక్ వండర్ కు శ్రీకారం చుట్టబోతు ఉండటం మీడియాకు హాట్ టాపిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: