తమిళ ఇండస్ట్రీలో భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఎదో ఒక సమస్యలు ముందుకు వేసుకు వస్తూనే ఉంటాయి. గతంలో  ఈ బాధలు కమల్, విక్రమ్,విజయ్,రజినీకాంత్ తాజాగా విశాల్ కూడా తప్పలేదు.. విశాల్ నటించిన తమిళ్ చిత్రం ‘పాయుమ్ పులి’ తెలుగులో ‘జయసూర్య’గా విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే ట్రయిలర్ రిలీజ్ అయ్యింది..మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ విడుదలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. గతంలో రజినీకాంత్ చిత్రం ‘లింగా’ చిత్రంతో బయ్యర్లు విపరీతమైన నష్టాన్ని చవిచూశారు. దీంతో వారు ‘లింగా’ చిత్రంతో కొన్ని ప్రాంతాల్లో వచ్చిన నష్టాన్ని పూడ్చే వరకు ‘పాయుం పులి’ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతించేది లేదని, అందుకే నిషేధిస్తున్నట్లు తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది. ఇక ఈ విషయంలపై పెద్ద రగడ జరుగుతుంది.

లింగా చిత్రానికి వచ్చిన నష్టాన్ని ‘పాయుంపులి’ కి రుద్దడమేంటీ.. ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు సినిమాలు ఆడుతాయి.. ‘లింగా’ నష్టానికి ‘పాయుం పులి’పై నిషేధం విధించడం తగదని, అది వృత్తిధర్మం కాదని, అందువల్ల, ‘పాయుం పులి’ ప్రదర్శనపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘం డిమాండు చేశారు.  ఇక అలా కూడా వినకపోతే.. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: