అన్నా చెల్లెళ్ళ – అక్క తమ్ముళ్ళ అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రతీక అమ్మానాన్నలతో సమానంగా ప్రేమను పంచిన సోదరులకు అన్నింటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది. కులం, మతం అనే భేదాలు లేకుండా భారతదేశమంతా ఒక వసుదైక కుటుంబం అని చాటే ఒక అర్ధం ఈ రాఖి పండుగలో ఇమిడి ఉంది. 

అన్నదమ్ములు లేని వారు కూడ తాము సోదరులుగా భావించుకునే వ్యక్తులకు రాఖీని కట్టి ఈ పండుగను చేసుకుంటారు. దీపావళి బాణాసంచాను తయారుచేసే తమిళనాడు లోని శివకాశి మార్కెట్ కు సమానంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు అందరూ ఉపయోగించే ఈరాఖీల తయారీ కూడ వందల కోట్ల బిజినెస్ లో ఉంటుంది అనే విషయం చాల ఆశ్చర్యకరం. గుజరాత్ లోని అహమ్మదాబాద్ ఈ రాఖీల తయారీకి కేంద్రం. రకరకాల రుచులతో కూడిన స్వీట్స్ అందమైన రాఖీలు ఈనాటి పండుగకు స్పెషల్.

ఈ పండుగను సామాన్యులే కాదు మన సినిమా సెలెబ్రెటీలు కూడ చాల జోష్ తో ఈరోజు జరుపుకుంటున్నారు. మంచువారి కుటుంబంలో రాఖీ పండుగ సంక్రాంతిని తలపించే హడవిడిని చేస్తుంది. మంచు లక్ష్మి ఈరోజు తన ఇద్దరి సోదరులకు రాఖీలు కట్టి గిఫ్ట్ గా బ్లాంక్ చెక్స్ తీసుకుంటుందట. అంతేకాదు ఈమధ్యనే తన జీవితంలోకి ప్రవేసించిన తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణకు కూడ గిఫ్టులు ఇవ్వాలసిందే అంటూ హడావిడి చేస్తుందట.

ఇక రకుల్ ప్రీత్ అయితే తాను ఎక్కడ ఉన్నా తన తమ్ముడుని అక్కడకు రప్పించుకుని అతడి చేతికి రాఖీ కట్టడమే కాకుండా అతడికి విలువైన బహుమతులు ఇస్తుందట. ఇదే బాటలో కోలీవుడ్ బ్యూటీ హాన్సిక మధుశాలినీ, రాశీ ఖన్నా లాంటి సెలెబ్రెటీలు తమ సోదరులకు రాఖీలు కడుతూ విలువైన బహుమతులు తమ సోదరుల వద్ద పుచ్చుకుంటూ ఉంటారట. ప్రపంచం యాంత్రికమై సెల్ ఫోన్స్ కు ఇంటర్ నెట్ కు యూత్ అతుక్కుపోతున్న నేటి రోజులలో అనుబంధాలను జ్ఞాపకం చేస్తూ ఈరోజు జరుపుకునే రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ళు – అక్కాతమ్ముళ్ళు అందరికీ ఆనుబంధాలను మరింత పoచాలని కోరుకుంటూ ఎపి హెరాల్డ్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: