ప్రస్తుత ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకి ఖర్చు పెట్టే మొత్తంతో దాదాపు పది చిన్న మూవీలు నిర్మించవచ్చు. అయితే ఆ టాప్ హీరోల మూవీలు బాక్సాపీస్ వద్ద భారీ సక్సెస్ ని చూస్తున్నాయంటే అదీ లేదు. 50 కోట్ల రూపాయలతో సినిమాని నిర్మిస్తే అది సాధించే కలెక్షన్స్ దాదాపు 90 కోట్ల రూపాయలు అనుకుందాం.

అంటే మూవీకి 40 కోట్ల రూపాయల ప్రాఫిట్. ఇది భారీ బ్లాక్ బస్టర్ సినిమా రిజల్ట్. కాని, అన్నీ మూవీలు ఇలాంటి సక్సెస్ ని సాధిస్తున్నాయంటే అదీ లేదు. అందుకే పెద్ద హీరోల మూవీల బడ్జెట్ పై అగ్ర దర్శకుడు గుర్రుగా ఉన్నాండంట. ఒక చిన్న సినిమాని 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తే వచ్చే ప్రాఫిట్ కచ్ఛితంగా మరో 4 కోట్ల రూపాయలు ఉంటుంది. చిన్న సినిమాల్లో మంచి కథలు దొరుకుతాయి. పెద్ద సినిమాల్లో స్టార్ ఇమేజ్ కనపడుతుంది. అంతే తేడా.. అంటూ ఆ దర్శకుడు అందరి దగ్గర బాహాటంగా చెప్పుకొస్తున్నాడు.

తను ఇలా ఎందుకు అంటున్నాడంటే, తాజాగారామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ‘బ్రూస్ లీ'. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి కొందరైతే, క్లైమాక్స్ బాగా రావాలనే ఉద్ధేశంతో కథని మరిచిపోతున్నారు అనే టాక్స్ కూడ వినిపిస్తన్నాయంట. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: