తెలుగు చిత్ర సీమలో మన్మధుడిగా పేరు పొందిన హీరో  నాగార్జున సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఈ రోజు మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు.


ఈ వేడుకను అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఇమేజ్ క్రియోట్ చేసుకున్నారు నాగార్జున. మిగతా హీరోలకు భిన్నంగా.... గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన శివ సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ మార్చారు. కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తూ, పరిశ్రమకు కొత్త రక్తం ఎక్కిస్తూ వస్తున్నారు. అలాగే నటుడుగా... యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు.


కె. రాఘవేంద్ర రావు దర్శకతక్వంలో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో టాప్ సినిమా. అలాగే శ్రీ రామదాసు పాత్రలో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. సాయి బాబా పాత్రలో కూడా మెప్పించారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ యంగ్ హీరోలతో పోటి పెడుతున్న మన్మధుడికి ఏపీహెరాల్డ్.కామ్ తరుపున శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: