తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించిన హీరో నాగార్జున.. అంచెలంచెలుగా మాస్, క్లాస్ ఫోలోయింగ్ సంపాదించారు. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు వచ్చిన మూస సినిమాలకు గుడ్ బై చెప్పారు. మన్మధుడిగా అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు.. కింగ్ గా వచ్చి మళ్లీ మాస్ ప్రేక్షకులను అలరించారు. నాగార్జున చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా' నటిస్తున్నారు.

ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 60 ఏళ్లకు దగ్గరవుతున్న నాగార్జున ఈ వయసులోనూ మన్మథుడిలా వెలిగి పోతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం.  అద్భుతమైన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకులు అంటున్నారు.


సోగ్గాడే చిన్ని నాయనా లో ఓ దృశ్యం


సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. లవ్లీ అనసూయ కూడా ఓ ఎంటర్టెనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: