అనుష్క కెరియర్ ను ఒక మలుపు తప్పిన ‘అరుంధతి’ సినిమాను ‘రుద్రమదేవి’ సినిమాను పోలుస్తూ కొందరు చేస్తున్న విశ్లేషణలు అత్యంత ఆ శక్తి దాయకంగా ఉన్నాయి. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ కి ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయో గతంలో ‘అరుంధతి’ సినిమాకు కూడ లెక్కలేనన్ని సమస్యలు వెంటాడాయని విశ్లేషకుల వాదన.
 
గతం లో కుడా ‘అరుంధతి’ సినిమా పూర్తి అయిన తరువాత ఆ సినిమాకు సరైన బయ్యర్లు దొరకక అనేక సార్లు వాయిదా పడింది. అప్పటికి కేవలం ఒక గ్లామర్ హీరోయిన్ గానే పేరు గాంచిన అనుష్కను ‘అరుంధతి’ గా ఎవరు చూస్తారు అంటూ అప్పట్లో బయ్యర్లు వెనక్కు వెళ్ళి పోయారు. అదేవిధంగా  అప్పట్లో ఈ సినిమాను తీసిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ప్రస్తుతం గుణశేఖర్ కు ఉన్నట్లుగానే అనేక ఆర్ధిక సమస్యలు ఉన్నాయి. అయినా అందరి అంచనాలను తారుమారు చేస్తూ ‘అరుంధతి’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ గుణశేఖర్ కు కూడ వర్తిస్తుంది అంటూ కొంతమంది గుణశేఖర్ కు ధైర్యం చెపుతున్నట్లు టాక్.

 ఈ విశ్లేషణలు నిజమే అని అనిపించేడట్లుగా  గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నరుద్రమదేవి మూవీ హిందీ వెర్షన్ రైట్స్ ను రిలియన్స్ కు చెందిన అబిషేక్ పిక్చర్స్ వారు 22 కోట్లకు సొంతం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగు వాళ్ళ  చరిత్రకు సంభందించిన ఈ సినిమాను హిందీలో అంత రేటుకు కొనటమేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫిలింనగర్ లో ప్రచారమవుతున్న ఈ వార్తను బయ్యర్లలో ‘రుద్రమదేవి’ క్రేజ్ పెంచడానికి అస్త్రంగా వాడుతున్నారు అనే మాటలు కూడ ఉన్నాయి. 

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం గోల్డెన్  హ్యాండ్ గా చలామణి అవుతున్న దిల్ రాజ్ చేయి రుద్రమదేవి విడుదల పై పడటంతో పాటు ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి ‘రుద్రమదేవి’ రైట్స్ ను కృష్ణా జిల్లాకు కొన్న నేపధ్యంలో కనీసం వీరిద్దరి అదృష్టం అయినా ‘రుద్రమదేవి’ ని రక్షించాలి అన్న మాటలు వస్తున్నాయి. కనీసం ఈ సెంటిమెంట్స్ అయినా రుద్రమదేవిని  రక్షిస్తాయో లేదో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: