ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పదేళ్ళకు పైగా చేస్తున్న హీరోయిన్స్ చాలానే మంది ఉన్నారు. పదేళ్ళ కెరీర్ పూర్తయినా వారిని ఆఫర్స్ వరిస్తూనే ఉన్నాయి. ఈ లిస్ట్ లో కలువకళ్ళ కాజల్ కూడ ఒకరు. అయితే తను తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకోవటంతో, తన ఫిల్మ్ కెరీర్ మరో మూడేళ్ళ వరకూ ఢోకా లేకుండా సాఫీగా సాగనుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ‘మగధీర’ సినిమాతో స్టార్డం తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారిన అందాల భామ కాజల్ అగర్వాల్.

ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ చేస్తూ, తన పదేళ్ళ కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. టెంపర్ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న కాజల్ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అవే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’,మహేష్ బాబు నటించనున్న ‘బ్రహ్మోత్సవం’. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కాజల్ ని హీరోయిన్ గా బుక్ చేసుకోవాలంటే నిర్మాతలతో పాటు హీరోలు కూడ తెగ భయపడిపోయారు. ఎందుకంటే ఒక్కోమూవీకి తను తీసుకునే రెమ్యునరేషన్ అలాగే అన్ని ఖర్చులు కలుపుకొని దాదాపు కోటిన్నర రూపాయలు టచ్ అయ్యేది.

దీంతో అంత పెద్ద అమౌంట్ అనేది నిర్మాతలకు, హీరోలకు మింగుడుపడని విషయంలా ఉండేది. ఆఫర్స్ లేకుండా మరో సంవత్సరం ఉంటే, తన ఫిల్మ్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉందని, ఓ నిర్ణయానికి వచ్చింది. తన రెమ్యునరేషన్ ని ఏకంగా 40 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం కాజల్ తో మూవీ అంటే అంతా కోటి రూపాయల లోపే ఉంటుంది. అందుకే ఎక్కవ మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు కాజల్ కి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. కాజల్ తో పాటు ఇతర హీరోయిన్స్ రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే కాజల్ చాలా తక్కువ రేటుకే చేస్తుంది.

ఈ ఆఫర్ నచ్ఛటంతో తెలుగు, తమిళ్, హింధీ చిత్రాల నుండి కాజల్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తను ఓప్పుకున్న చిత్రాలతో కాజల్ మరో మూడు సంవత్సరాలు ఫుల్ బిజిగా మారిపోయింది. ప్రస్తుతం, ఈ ఏడాది కాజల్ పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విశాల్ సరసన చేసిన పాయుం పులి లేదా జయసూర్య సినిమా షూట్ మొత్తం పూర్తయ్యి సెప్టెంబర్ 4న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది కాకుండా తాజాగా కాజల్ మరో క్రేజీ తమిళ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. తమిళ యంగ్ హీరో జీవ హీరోగా దీకి డైరెక్షన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు కాజల్ సైన్ చేసింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: