ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ రామ్ చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్. అవును రామ్ చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ బ్రూస్ లీ మూవీ టైటిల్ ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో, అంతే హాట్ టాక్ ని కూడ సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించిన కథ, చిరంజీవి మూవీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కథలోని పాయింటే అని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కెర్లు కొడుతుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ ఆర్ సి 9 టైటిల్ బ్రూస్లీగా ఫిక్స్ చేశారు. ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో ట్యాగ్ లైన్ లో అంతే పంచ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ బాడీ డబుల్ ఆర్టిస్టు(ఫైటర్)గా నటిస్తున్నాడు. శ్రీనువైట్ల తన శైలిని మార్చి ఈసారి కాస్త కొత్తగానే ఎటెంప్ట్ చేస్తున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ లో గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయనేది తాజా అప్ డేట్. ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్న గోపిమోహన్ ఈ టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. 'బ్రూస్లీ - ది ఫైటర్' పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. యాక్షన్ లవ్ వినోదం జోడించి తెరకెక్కిస్తున్నారు. చరణ్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయి. రషెస్ చూశాను. ఆడియెన్ ఈ చిత్రానికి కనెక్టవుతారు... అని చెప్పాడు. అయితే ఇండస్ట్రీ పీపుల్స్ చెప్పుకునే దానిప ప్రకారం, గ్యాంగ్ లీడర్ మూవీలోని చిన్న పాయింట్ ని తీసుకొని బ్రూస్ లీ కథని డెవలప్ చేశారంట.

ఇక ఫైట్స్ విషయానికి వస్తే చిరంజీవి పలుసినిమాల్లో చేసేని ఫైట్స్ నే తనయుడిపై రుద్దారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా చిరు సినిమా కథనే శ్రీనువైట్ల మళ్ళీ రిచ్ గా షూట్ చేసి చూపిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు గ్యాండ్ లీడర్ ని ఊహించుకుంటూ రామ్ చరణ్ ఈ మూవీలో ఏ రేంజ్ యాక్టింగ్ చేశాడో అని ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: