గత కొద్ది కాలంగా రూమర్స్ తో హడావిడి చేసిన త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో త్రివిక్రమ్ జూనియర్ పవన్ లకు షాక్ ఇవ్వబోతున్న విషయం స్పస్టమైoది. వినాయక చవితినాడు అధికారికంగా ప్రకటిస్తారు అనుకున్న ఈన్యూస్ చవితికన్నా ముందే వెల్లడి కావడంతో త్రివిక్రమ్ సంక్రాంతి రేసుకు సిద్ధ పడుతున్నట్లే అనుకోవాలి. 

నాగ చైతన్య నితిన్ ల మధ్య జరిగిన చదరంగంలో చిట్టచివరకు అధికారికంగా నితిన్ త్రివిక్రమ్ సినిమాలో హీరోగా మారిపోయాడు. ఇప్పటికే సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసిన ఈ సినిమాకు మరో హీరోయిన్ ను ఎంపిక చేయవలసి ఉంది. హీరోయిన్ కు ప్రాధాన్యత ఉన్న ఈసినిమాలో సమంత పాత్ర కీలకం అని అంటున్నారు.

మొట్టమొదటి సారిగా ఒక తెలుగు సిమాకు కేజి కోలీవుడ్ మ్యూజిక్  డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసినిమాను త్రివిక్రమ్ నాలుగు నెలల్లో పూర్తి చేయబోతూ ఉండటం ఒక రికార్డు. దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఇలావేగంగా సినిమాలు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఈసారి పూరి రికార్డు పై  త్రివిక్రమ్ కన్నేసాడు. కాని ట్విస్ట్ ఏమిటంటే సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ బాలకృష్ణ ‘డిక్టేటర్’ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు సిద్ధం అవుతూ ఉండటంతో ఈమూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలకు త్రివిక్రమ్ నిర్ణయం షాక్ ఇవ్వబోతుంది అనుకోవాలి. 

ఫ్యామిలీ ఆడియన్స్ ను తన సినిమాలకు రప్పించుకోగలిగే త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఏ భారీ సినిమాకు గండి కొడుతుందో అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి..
 



మరింత సమాచారం తెలుసుకోండి: