తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి..తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ..ఇప్పుడు మాస్ మహరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరో రవితేజ. రఫ్ అండ్ టఫ్ గా మాస్ ప్రేక్షకుల మనసు రంజింపచేసే విధంగా రవితేజ యాక్షన్, కామెడీ అన్ని రకాలుగా మెప్పించగలరు. ఆ మద్య కిక్ సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా సురెందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ,రకూల్ ప్రితిసింగ్ నటించిన కిక్ 2 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 ఈ సినిమా అనుకున్న స్థాయికి చేరుకోలేదన్న టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా కూడా ఢీలా పడినట్లు సమాచారం. దాదాపు 10 కోట్లు లాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవటం మొదలయ్యాయి.   నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. ఈ చిత్రం సెకండాఫ్ బోర్ కొట్టిందని,ఎంటర్టైన్మెంట్ తక్కువైందని కంప్లైంట్ లు వచ్చాయి. దర్శక,నిర్మాతలు రంగంలోకి దిగి సెకండాఫ్ ని ఇరవై నిముషాలు కట్ చేసి,ట్రిమ్ చేసి వదిలారు. అయినా కూడా  ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక పోతుందట.


కిక్ 2 చిత్రం పోస్టర్


మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతోంది.  నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేసారు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందించాం.''అని తెలిపారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: