యూత్ గర్ల్స్ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హీరో షాహిద్ కపూర్. తాజాగా షాహిద్ కపూర్ పెళ్ళి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. షాహిద్ కపూర్ స్వతహా రాధాస్వామి డివోటీ కాబట్టి ఆ సాంప్రదాయంలోనే గురువుల సమక్షంలో పెరిగిన ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్ ని పెళ్లాడేశాడు. సినిమా హీరో సినిమా హీరోయిన్ నే పెళ్లాడాలి.. అన్న రూల్ ని బ్రేక్ చేసి ఓ కాలేజ్ స్టూడెంట్ ని పెళ్లాడి అందరికీ సర్ ప్రైజ్ నిచ్చాడు.

ఇదిలా ఉంటే భార్య మీరా రాజ్ పుత్ అచ్చు హీరోయిన్ గా కనపడుతుంది బాహ్య ప్రపంచానికి. పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సినిమాలు బుల్లితెర షోలు పూర్తి చేసుకుని ఇటీవలే మీరా రాజ్ పుత్ తో హనీమూన్ ప్లాన్ చేశాడు. హనీ మూన్ అనంతరం ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరూ తాజాగా ఓ ర్యాంపు షోలో పార్టిసిపేట్ చేశారు.

షాహిద్ ఉన్నట్టుండి భార్య మీరా రాజ్ పుత్ ర్యాంపుపై తన అందాలను చూపించుకుంది. మీరా రాజ్ పుట్ టాప్ టు బాటమ్ అదరగొట్టేసింది. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరించడంలో సినిమా తారలెవరూ తనకి సాటిరారని నిరూపించింది. బాలీవుడ్ కి వచ్చిన కొత్త హీరోయిన్ గా మీరా రాజ్ పుత్ కనిపించడంతో చాలా మంది అక్కడిక్కడే రాజ్ పుత్ ని హీరోయిన్ చేస్తావా? ఆఫర్స్ రెడీగా ఉన్నాయి..అంటూ షాహిద్ ని అడగటం మొదలు పెట్టారు.

ఈ ప్రశ్నలకు మీరా రాజ్ పుత్ సైతం నవ్వుతూనే సమాధానం చెప్పుకొచ్చింది తప్ప వారి ప్రశ్నలకు అవును అని మాత్రం చెప్పలేదు. అయితే బిటౌన్ లో వినిపిస్తున్న సమాధానం మేరకే, నిజ జీవితంలో దంపతులుగా ఉన్న వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో హీరో,హీరోయిన్స్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మీరాలోని జోష్ చూస్తుంటే కొంపదీసి హీరోయిన్ అయిపోతుందా? అనిపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: