ఇండియన్ సినిమా రంగంలో టాప్ టెన్ మూవీస్ లో స్థానం పొందిన ‘బాహుబలి’ స్థాయిని చేరుకునే సినిమా ఇప్పట్లో టాలీవుడ్ లో రాదు అని అందరూ అనుకుంటున్న నేపధ్యంలో ఇంకా విడుదల కాకుండానే రామ్‌చరణ్ న్యూఫిల్మ్ ‘బ్రూస్ లీ’  ‘బాహుబలి’ రికార్డులను మొదటి స్టెప్ లోనే బ్రేక్ చేయడం సంచలనంగా మారింది. 

అంతేకాదు ఈసినిమా మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్రీమంతుడు’ రికార్డును కూడ బ్రేక్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా వినడానికి ఈ వార్తలు అందరకి షాక్ ఇస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘బ్రూస్ లీ’ సినిమా గల్ఫ్ రైట్స్ 47 లక్షలకు అమ్మకం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘బాహుబలి’ సినిమాతో గల్ఫ్ దేశాలలో కూడ మన తెలుగు సినిమాల హవా మొదలైంది. అయితే ‘బాహుబలి’ సినిమా గల్ఫ్ రైట్స్ 45 లక్షలకు అమ్మకం జరిగింది. ఆ తరువాత విడుదలైన మహేష్ ‘శ్రీమంతుడు’ 43 లక్షలకు గల్ఫ్ లో మార్కెట్ చేయడం జరిగింది.

అయితే ఈ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ 47 లక్షలకు రైట్స్ అమ్మడం జరిగింది అన్న వార్తలను బట్టి చరణ్ సినిమాకు గల్ఫ్ ప్రాంతంలో అంత క్రేజ్ ఉందా ? అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోoది. ఇప్పటికే చిరంజీవి అతిథి పాత్రతో క్రేజ్ ను పెంచుకున్న ఈసినిమా దసరా పండుగకు ముందు విడుదల అవుతున్న నేపధ్యంలో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ రికార్డులను నిజంగా ఈ సినిమా బ్రేక్ చేస్తుందా అంటూ కొంతమంది మెగా అభిమానులు ఈ వార్తలు విని పండుగ చేసుకుంటున్నారని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: