టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ప్రతి ఒక్క హీరోయిన్ అందరి స్టార్ హీరోలతో నటించలేదు సరి కదా అలా  నటించిన రెండు మూడు సినిమాలతోనే సూపర్ క్రేజ్ ని సంపాధించుకున్నారు. ఇక చేసిన వారితోనే చేస్తూ ఫామ్ని కొనసాగిస్తున్నారు తప్ప అందరు స్టార్ హీరోలతో చేసిన హీరోయిన్ మాత్రం ఎవరు లేరు. కాని ఇప్పుడు ఆ రికార్డును కాజల్ సొంతం చేసుకుంటుంది.  స్టార్ హీరోయిన్ అవ్వడం అంటే అందరి స్టార్ హీరోలతో నటించాలి.

 

ఇన్నాళ్ళు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక్క పవర్ స్టార్ తోనే చేయలేదని బాధపడ్డది, కాని సర్ధార్ సినిమాతో ఆ ముచ్చట కూడా తీరబోతుంది. బ్యూటిఫుల్ అండ్ ఛార్మింగ్ డార్లింగ్ హీరోయిన్ కాజల్ కళ్యాణ్ రామ్ తో మొదలుకుని ఎన్టీఆర్ వరకు అందరితో నటించేసింది.  టాలివుడ్ టాప్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్,రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, లాతో పాటుగా కుర్ర హీరోలు రామ్, నాగ చైతన్య, కళ్యాణ్ రామ్, నితిన్, సుమంత్, నవదీప్ లతో కూడా నటించింది. ఇలా టాలీవుడ్లో దాదాపు అందరి హీరోలతో జత కట్టిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది కాజల్..


హాట్ లుక్ తో కాజల్ :

 

ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాలేదు. ఇక ఆ అవకాశం సర్ధార్ మూవీ ద్వారా వచ్చింది. రవితేజ కి ‘పవర్’ లాంటి మాంచి కిక్ హిట్ ఇచ్చిన డైరక్టర్ రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఫైనల్ గా కాజల్ కే ఈ ఛాన్స్ దక్కింది. హాట్ భామ కూడా పవర్ స్టార్ కి జోడీగా నటించడం పట్ల చాలా హ్యాపీగా ఉంది.

 

అమ్మడు సర్ధార్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: