తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన చిత్రం ‘బాహుబలి’. ప్రపంచ వ్యాప్తంగా ఒక తెలుగు చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం ఇదే ప్రథమం. ఇప్పటికే తెలుగు, తమిళ,హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. అంతే కాదు తెలుగు లో కూడా ఇంతటి అద్భుతమైన చిత్రాలు తీసేవారు ఉన్నారా అని ప్రపంచ వ్యాప్తంగా పొగిడేలా చేసిన చిత్రం బాహుబలి.

బాక్సాఫీసు వసూళ్లలో రికార్డుల మీద రికార్డులు కొట్టి దర్శకుడు రాజమౌళి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి మోసుకుపోయింది. ఇప్పుడీ చిత్రరాజం మరో విశిష్టతను సంతరించుకుంటోంది.2015 ఆస్కార్ ట్రోఫీ కోసం నామినేటయ్యే సినిమాల జాబితాలో చోటు కోసం ఇండియా నుంచి పోటీ పడుతున్న నాలుగు చిత్రాల్లో బాహుబలి ఒకటిగా నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమే కాదు ప్రపంచ సినిమా కూడా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన సినిమా బాహుబలి. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు, విమర్శకుల ప్రశంసలూ అందుకొంది.

బాహుబలి చిత్రం పోస్టర్


వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఆస్కార్ అవార్డుల పోటీకి ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కింద భారతదేశం నుంచి వెళ్లే అరుదైన అవకాశాన్ని ఈ చిత్రం పొందనుంది. వచ్చే నెల 25న దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అమోల్ పాలేకర్ నేతృత్వంలోని ఆస్కార్ జ్యూరీ 45 సినిమాలను పరిశీలించి అందులోంచి ఒక సినిమాను మన దేశం నుంచి ఆస్కార్‌కు పంపిస్తుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సెప్టెంబర్లో వెలువడుతుంది. ఇదే వాస్తవమైతే కనుక, తెలుగు సినిమా సిగలో ఇదో కలికితురాయి అవుతుంది!  



మరింత సమాచారం తెలుసుకోండి: