స్టార్ హీరోలు సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే నింపి ఆడియెన్స్ కి బంచ్ ఆఫ్ మాస్ మిక్సర్ లా ఇస్తారు. ఒక స్టార్ హీరో సినిమాలో కావాల్సిన అన్ని అంశాలు కథలో ఉండేలా చూసుకుంటారు. అయితే అందరి స్టార్ హీరోలది ఒక వరుస అయితే దీనిలో చాలా ప్రత్యేకం మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుది. అప్పుడెప్పుడో తేజ అన్నాడు మహేష్ బాబుని డైరెక్ట్ చేయడం చాలా ఈజీ.. సీన్ చెబితే చాలు అతనికి పర్ఫెక్ట్ అనిపించే దాకా టేక్ ఓకే చేయడు అని. అలాగే పూరి కూడా చెప్పాడు మహేష్ సీన్ ఎలబరేట్ చేసే విధానం చాలా బాగుంటుందని.

సినిమా సినిమాకు మహేష్ తన యాక్టింగ్ స్టామినాను పెంచుకుంటూ పోతున్నాడు. కోట్ల కొద్ది ఫ్యాన్స్.. వేల కొద్ది ఎక్స్ పెక్టేషన్స్.. వీటన్నిటిని మించి సినిమా హిట్ కొడతామా లేదా అనే టెన్షన్. ఇవన్ని మైండ్ లో ఉంచుకునే ఏ పెద్ద హీరో అయినా సినిమా చేస్తాడు. కాని మహేష్ కేవలం ఈ హిట్ ఫార్ములానే నమ్ముకోకుండా తెగించి కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్స్ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఏదో ఒక రివేంజ్ స్టోరీని పాపులర్ ఇద్దరు, ముగ్గురు రైటర్స్ ని పిలిపించుకుని జబర్దస్త్ మాస్ మసాలా కథని తెరకెక్కించవచ్చు. కాని మహేష్ ఆలోచన అది కాదు తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ సినిమాలు చూపించాలానే తపన పడుతూ ఉంటాడు.

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన ఫ్యాన్స్ ని కూడా మంచి మంచి సినిమాలతో అలరిస్తాడు సూపర్ స్టార్ మహేష్. అయితే తాను తీసుకునే నిర్ణయాల వల్ల కాస్త రిజల్ట్ అటు ఇటుగా మారి తను పడ్డ శ్రమ వృధా అవుతుంది. ఉదాహరణకు 1 నేనొక్కడినే సినిమా చాలా అద్భుతంగా చేశారు..కాని రిజల్ట్ చూస్తే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకుండా పోయింది. అయితే సినిమా హిట్టా..ఫట్టా అని పక్కన పెడితే మహేష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇరగదీస్తున్నాడు. ఏ క్యారక్టర్ అయినా మహేష్ ఇట్టే అల్లుకుపోతున్నాడు.

క్యారక్టర్ ఏదైనా మహేష్ చేస్తే అది సూపర్ హిట్టే. ప్రస్తుతం మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమా కూడా మరోసారి దాన్ని నిజం చేసింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది ఇక ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న మహేష్ తర్వాత చేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూట్ లో త్వరలో పాల్గొననున్నాడు. సో మహేష్ చేస్తున్న ఈ తెగింపుకి మునుముందు ఇంకా భారీ విజయాలు తన ఖాతాలో వచ్చి చేరుతాయనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: