సూపర్ స్టార్ మహేష్ బాబు శృతిహాసన్ జంటగా నటించిన సినిమా శ్రీమంతుడు రిలీజ్ అయిన దగ్గరనుండి ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్పటివరకు దాదాపు అన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసిన శ్రీమంతుడు రిలీజ్ అయ్యి 25 రోజులవుతున్నా కలెక్షన్లు మాత్రం ఇంకా కాన్ స్టంట్ గానే కొనసాగిస్తుంది. తాజాగా 80 కోట్ల కలెక్షన్ మార్క్ దాటిన మూడవ మూవీగా 'శ్రీమంతుడు' మరో రికార్డ్ దక్కించుకుంది. టాలీవుడ్ లో ఇప్పటివరకు మగధీర, బాహుబలి సినిమాలు మాత్రమే 80 కోట్ల కలెక్షన్ షేర్ వసూలు చేసిన సినిమాలుగా రికార్డులో ఉన్నాయి. కాని ఇప్పుడు ఆ సినిమాలకు తోడుగా శ్రీమంతుడు కూడా ఆ ఫీట్ ని సాధించాడు. అయితే వస్తున్న కథనాల ప్రకారం ఈ వీకెండ్ తో 'మగధీర' రికార్డును కూడా 'శ్రీమంతుడు' క్రాస్ చేసి 2వ స్థానంలో నిలుస్తాడని ట్రేడ్ టాక్.

 

సోమవారంతో 25 రోజుల వరకు వరల్డ్ వైడ్ గా 80 కోట్ల మార్క్ చేరిన 'శ్రీమంతుడు' ఏరియాల వారీ 24 రోజుల కలెక్షన్ షేర్స్ వవరాలు ఇలా ఉన్నాయి. నైజాం 20 కోట్ల 41 లక్షలు, సీడెడ్ 8. 65, గుంటూరు 5.35, ఈస్ట్ గోదావరి 5.31, ఉత్తరాంధ్ర 5.23, కృష్ణా 4.12, వెస్ట్ గోదావరి 4.10, నెల్లూరు 1.94, టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ 55 కోట్ల 11 లక్షలు. అమెరికా 12 కోట్లు. రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ 2.40,  రెస్ట్ ఆఫ్ ఇండియా 2.25, కర్నాటక 6.90, తమిళనాడు 75 లక్షలు.  టోటల్ వరల్డ్ వైడ్  తెలుగు వెర్షన్ 78 కోట్ల 66 లక్షలు. తమిళ్ వెర్షన్ 75 లక్షలు. మలయాళం 45 లక్షలు. మూడు వెర్షన్స్ టోటల్ 79 కోట్ల 86 లక్షలు.

 

రిపీటెడ్ ఆడియెన్స్ కోసం మొన్నటి నుండి సినిమాలో రెండు సీన్లు కూడా యాడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా కలెక్షన్లు రేజ్ అయ్యే అవకాశం ఉంది. కొరటాల శివ ఎంతో కష్టపడి ప్రేమించి రాసి తెరకెక్కించిన సినిమాకు ఇంత ప్రేక్షకాదరణ పొందటం మెచ్చుకోదగ్గ విషయం. బ్యాక్ టు విలేజ్ కాన్సెప్ట్ నే ఒక మంచి సినిమాగా చెప్పిన చిత్ర యూనిట్ అంతా ప్రముఖులందరి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంది.

 

ఇక ఈ ఇన్స్పి రేషన్ తోనే మహేష్ బాబు ఏపీలో ఒక విలేజ్, తెలంగాణాలో ఒక విలేజ్ ని దత్తత తీసుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: