రేపు జరగ బోతున్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు రేణుదేశాయ్ ఒక సంచలనం  చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. పవన్ భార్యగా అతడి నుండి విడిపోయినా ఆమె నిరంతరం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గా ఉంటు అందరి దృష్టి ఆకర్షించే విధoగా తన కామెంట్స్ ను ట్విట్స్ రూపంలో పెడుతూ తన సందడిని కొనసాగిస్తూనే ఉంది. 

ఇది ఇలా ఉండగా రేపు పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు భారీ స్థాయిలో ప్రారంభించబోతున్న ‘ఒక చెట్టును నాటండి దానితో కలిసి సెల్ఫీ తీసుకోండి’ అనే కార్యక్రమంలో పాల్గోనబోతున్నట్లుగా ట్విట్ చేయడమే కాకుండా ఆ ప్రయత్నానికి పవన్ అభినందనలు ఉన్నాయి అంటూ ట్విట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘పవన్ కు సెప్టెంబర్ 2న ప్లాంట్ ఎ ట్రీ పోగ్రాంకి సంబంధించిన ఫొటోని చూపించాను ఆయన నవ్వి మంచి ప్రారంభం అన్నారు’ అంటూ ట్విట్ చేసి తాను ఇంకా తరుచు పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాను అన్న భావాన్ని మరోసారి కలుగచేసింది. 

మోడల్ గా తన కెరియర్ మొదలు పెట్టి ఆ తరువాత నటిగా మారి ఆపై పవన్ కళ్యాణ్ కు భార్యగా  మారిన రేణు దేశాయ్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అయితే వాటిఅన్నింటిని ధైర్యంగా తట్టుకోవడమే కాకుండా దర్శకురాలిగా మారి ప్రస్తుతం సినిమాలు తీస్తున్న రేణు తరుచూ ఇలా ఎదోసందర్భంలో పవన్ దృష్టిలో మళ్ళీ పడటానికి ఇలా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇలా రేణు దేశాయ్ ఎందుకు ప్రవర్తిస్తోంది అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఆమె ప్రయత్నాలు మటుకు అందర్నీ ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్ అభిమానులు రేపు జరగబోతున్న పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటుగా చాలచోట్ల మెడికల్ క్యాంపులు, కల్చరల్ కార్యక్రమాలు పవన్ అభిమానులు భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. రేపటినుంచి ప్రారంభం కాబోతున్న పవన్ అభిమానుల చెట్లు నాటే కార్యక్రమం విజయవంతం అయితే ఇరు రాష్ట్రాలలోను ఒక మంచి కార్యక్రమానికి పవన్ అభిమానులు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: