ఈవారం విడుదల కాబోతున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ప్రమోషన్ కోసం నాని వరస పెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసినిమాను  ప్రమోట్ చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో వరస పరాజయాలతో సతమతమవుతున్న నాని ఈసినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ చాల బాగుంది అంటూ ప్రభాస్ బన్నీలు కామెంట్ చేసి నానికి బాసటగా నిలవడంతో తనకు ఈసినిమా ఖచితమైన విజయాన్ని అందిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు నాని. 

ఇప్పటి వరకు తెలుగు హీరోలు ఎవ్వరూ పోషించని ఒక మతిమరుపు పాత్రకు లవ్ స్టోరీని కనెక్ట్ చేసి తీసిన మారుతి ప్రయోగం పై ఫిలింనగర్ లో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో లిప్ లాకింగ్ సీన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు నాని. తాను హీరోగా ఎన్ని వెరైటీ పాత్రలు చేయడానికి అయినా సిద్ధమే కాని తాను ఇక భవిష్యత్ లో ఏ హీరోయిన్ తోను లిప్ లాక్ సీన్స్ లో నటించను అంటూ ‘ఆహా కళ్యాణం’ సినిమాలో తాను ఆ సినిమా హీరోయిన్ వాణి కపూర్ తో చేసిన లిప్ లాక్ తన కుటుంబంలో ఎలా చిచ్చు రేపిందో నవ్వుతూ వివరించాడు నాని.

‘ఆహా కళ్యాణం’ విడుదలైన రోజున మొదటిరోజు మొదటి ఆటకు నాని తన భార్యతో ఆసినిమాకు వెళ్ళాడట. అయితే తాను వాణి కపూర్ తో లిప్ లాక్ చేసే సీన్ ప్రారంభం అయిన వెంటనే అప్పటి వరకు త పక్కన కూర్చున్న తన భార్య బయటకు వెళ్ళిపోయిందని చెపుతూ ఆ సినిమా పూర్తి అయిన తరువాత తాము ఇంటికి వెళ్ళిపోయాక కూడ తన భార్య తనతో మాట్లాడకుండా మౌనంగా ఉందని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు నాని. 

అయితే తన భార్యకు కోపం వచ్చింది అనే సంగతి గ్రహించిన తాను తన భార్యతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆమె ఏడ్పు మొదలు పెట్టిందని దానితో ఆమెను ఓదార్చడానికి తనకు ఒక పూట పట్టిందన్న విషయాన్ని చెపుతూ ఒక వైపు ‘ఆహా కళ్యాణం’ ఫెయిల్ అయింది అన్న బాధ మరో వైపు తన భార్య ఏడుపు మధ్య తనకు నరకంగా ఆరోజు గడిచిందని ఆనాటి విషయాలను బయట పెట్టాడు నాని. దీనితో ఇక భవిష్యత్ లో తాను ఏ హీరోయిన్ తోను లిప్ లాక్ సీన్ లో నటించ కూడదని ఆనాడే నిశ్చయించుకున్నాను అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు నాని



మరింత సమాచారం తెలుసుకోండి: