తెలుగు ఎన్నో హిస్టారికల్ సినిమాలు వచ్చాయి అయితే కాకీయుల చరిత్రలో మకుటం లేని మహరాణిగా వెలిగిపోయిన రుద్రమదేవి చరిత్ర ఇప్పటి వరకు రాలేదు.. ఇప్పుడు తెలుగులో దర్శక నిర్మాత గుణశేఖర్   13వ శతాబ్దం నాటి కాకతీయ వైభవం ప్రేక్షకులకి మర్చిపోలేని అనుభూతిగా మిగలాలనే.. సాంకేతికంగా ఎన్నో అవరోధాలు దాటుకుని 3డిలో సినిమా రూపొందించామన్నారు. తెలుగు, తమిళ, మళయాళంతో పాటు హిందీలో కూడా రుద్రమదేవిని విడుదల చేయనున్నారు.

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తిక కాక పోవడంతో సినిమాను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ సందర్బంగా గుణశేఖర్ మాట్లాడుతూ తెలుగు వారందరికీ గర్వకారణమైన రుద్రమదేవి చరిత్రను తెరపై చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ మార్చినందుకు వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను.దర్శకనిర్మాత గుణ శేఖర్ మాట్లాడుతూ '' ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం.

రుద్రమదేవి పోస్టర్

 

రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు. ‘భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తయారవుతున్న మా చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్‌'కు అమితాబ్‌ బచ్చన్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఎంతటి ఎస్సెట్‌ అయ్యిందో, మా చిత్రానికి చిరంజీవిగారిచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుంది. అడగ్గానే అంగీకరించి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: