ప్రస్తుతం నానీ హీరోగా చేసిన అప్ కమింగ్ మూవీ భలే భలే మగాడివోయ్.. హీరో నాని, దర్శకుడు మారుతిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి కొత్తగా లాంచ్ అయిన గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్‌ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది.

దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా వేగవంతం అయ్యాయి.భలే భలే మగాడివోయ్.., సినిమాకి చిత్ర టీం విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తుంది. గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ స్ట్రాటజీనే ఈ భలే భలే మగాడివోయ్ చిత్రానికి అప్లై చేస్తున్నారు. కేవలం స్టార్ ప్రమోటింగ్, అలాగే మౌత్ పబ్లిసిటీ వంటి విషయాలపై చిత్ర నిర్మాతలు ద్రుష్టి పెట్టారు. 

నిర్మాత బన్నీ వాస్ కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ, భలే భలే మగాడివోయ్ సినిమాను వేర్వేరుగా చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారని, సినిమా ఎంటర్‌టైనింగ్‌గా హీరో నాని,దర్శకుడు మారుతి, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలతో పాటు సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది. 

గతంలో నాని నటించిన కొన్ని మూవీలు తప్పితే, చాలా మూవీలకి పబ్లిసిటి అనేది పక్కా ప్లానింగ్ ప్రకారం ఎక్కడా జరగలేదు. దాంతో తన మూవీలపై రిలీజ్ కి ముందే నెగిటివ్ టాక్ వచ్చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. కానీ తను తాజాగా నటించిన ఈ భలే భలే మగాడివోయ్ చిత్ర ప్రమోన్స్ కోసం, నానికి భలే  సపోర్ట్ దొరికిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: