బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ కు ఒక సెలెబ్రెటీ స్టేటస్ క్రియేట్ చేసింది రాజమౌళి. సంపూ బాబు నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైన తరువాత ఆ సినిమాలోని సంపూర్నేష్ లుక్ ను అభినందిస్తూ రాజమౌళి ఆరోజు ట్విట్ చేయడంతో సంపూ ఆ సినిమా విడుదల కాకుండానే సెలెబ్రెటీగా  మారిపోయాడు.  

అటువంటి సంపూర్నేష్ లేటెస్ట్ గా నటిస్తున్న తన ‘కొబ్బరి మట్ట’ సినిమా మోషన్ పోస్టర్ లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ మూవీ ట్రైలర్ లుక్ ను వెరైటీగా వాడుకోవడం రాజమౌళి అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. ఈ విషయం రాజమౌళి వరకు వెళ్ళడంతో జక్కన్న కూడ సంపూ పై అసహనం వ్యక్తం చేసినట్లు టాక్.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళడమే కాకుండా ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంపిక కాబడుతుంది అని ఊహిస్తున్న ‘బాహుబలి’ సినిమా పోస్టర్ పై సంపూ సెటైర్లు ఏమిటి అని అంటూ రాజమౌళి అభిమానులు మండిపడుతూ సంపూను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ విషయం సంపూ దృష్టికి రావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టడమే కాకుండా రాజమౌళి అభిమానులకు రాజమౌళికి క్షమార్పణలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బర్నింగ్ స్టార్ ఈ విషయమై తన సన్నిహితులతో వేరే విధంగా కామెంట్ చేసినట్లు టాక్. ‘బాహుబలి’ సినిమా పై ఇప్పటికే ఎన్నో సెటైర్లు వచ్చిన నేపధ్యంలో కేవలం తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసారు అని సంపూ గగ్గోలు పెడుతున్నాడట..  


మరింత సమాచారం తెలుసుకోండి: