ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్బంగా రామ్ చరణ్ తన బాబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ విడుదల చేసిన ‘బ్రూస్ లీ’ లేటెస్ట్ టీజర్ పై పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రభావం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమాకు ‘బ్రూస్ లీ’ అనే పేరు పెట్టడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈసినిమాకు దూరం అవుతారు అని కామెంట్స్ వచ్చిన నేపధ్యం లో ఆ కామెంట్స్ కు సమాధానం గా ఒక కుటుoబ సినిమా ఇమేజ్ ‘బ్రూస్ లీ’ సినిమాకు వచ్చే విధంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ రోజు విడుదల అయిన ఈ టీజర్ ను చూస్తూ ఉంటే కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ‘బ్రూస్ లీ’ ని తీర్చిదిద్దడానికి దర్శకుడు శ్రీనువైట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.  

ప్రస్తుత పరిస్థితులలో చరణ్ కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి కాబట్టి అటు మాస్ ను ఇటు క్లాసును టార్గెట్ చేస్తూ మధ్యలో చిరంజీవి అతిథి పాత్రను బాగా ఉపయోగించుకుని తాను కూడ 100 కోట్ల రేస్ లో ఉన్నాను అని చెప్పే విధంగా ఈ టీజర్ ఉందని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

రామ్ చరణ్ త్రివిక్రమ్  దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ ఇమేజ్ ని కూడ ఇలా చరణ్ తన ‘బ్రూస్ లీ’ కి వాడుకుంటున్నాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: