తెలుగు చిత్ర సీమలో మెగస్టార్ చిరంజీవి   వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు.   పవన్ కళ్యాణ్  మొదటి సినిమా అనకున్న స్థాయిలో ఆడకపోయినత తర్వాత వచ్చిన  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి', గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు.


పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.  పవన్ కళ్యాణ్ క్రేజ్ కు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు. పవన్ సినిమాకు ఉన్న స్టామినా, రేంజ్ చాలా ఎక్కువే. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలే అందుకు నిదర్శనం. తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.


 ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాన్

Sardaar Gabbar Singh Latest Poster

కాకినాడలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో 44వ పుట్టినరోజు సందర్భంగా 44 అడుగుల పొడవైన కేక్ తయారు చేయించారు. 550 కేజీల బరువుతో తయారైన ఈ కేకుపై పవన్ కళ్యాణ్ పేరుతో పాటు జనసేన పార్టీ లోగో ముద్రించారు. జెఎన్‌టియూ స్టూడెంట్స్ దీన్ని స్పెషల్ గా ప్రిపేర్ చేసారు. ఈ కేకును క్యాంపస్ లో ప్రజల సందర్బనార్థం ఉంచారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వివిధ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు బిజీ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: