కోలీవుడ్ మార్కెట్ లో శింబుతో పరిచయం అనేది దాదాపు ఓ ప్రమాదం లాంటిదే అనేది ప్రతి హీరోయిన్ అభిప్రాయం. ఒక్క హీరోయిన్స్ అభిప్రాయమే కాదు, గర్ల్ ప్రెండ్స్ సైతం శింబుతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంలే శింబు చేసే మాయల గారడీలకు, ఎవరైన పడిపోవాల్సిందే. శింబు ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో తనకు ఉన్న లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్, అజిత్ కి కూడ లేదంట! ఇదిలా ఉంటే తాజాగా శింబుకి హన్సికల మధ్య ప్రేమ వ్యవహారం చిగురిస్తున్నట్టు కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

తను నటించిన వాలు మూవీ కోలీవుడ్ లో సక్సెస్ కావటంతో శింబు కంటే ఎక్కువుగా హన్సిక సంతోషపడుతుందని అంటున్నారు. అంతే కాకుండా శింబు మరిన్ని సక్సెస్ లు రావాలని హన్సిక కోరుకుటుందట. కావాలంటే హన్సిక తన కాల్షీట్స్ ని శింబు కోసం ప్రత్యేకంగా అడ్జెస్ట్ చేయటానికి కూడ సిద్ధంగా ఉంది. మొత్తంగా శింబు సంతోషం కోసం హన్సీక రాత్రి,పగలూ ఆలోచిస్తూనే ఉంటుంది.

తను ఫారిన్ లొకేషన్ లో ఉన్నప్పుడు కూడ శింబు చేస్తున్న ప్రాజెక్ట్స్ డిటైల్స్ ని అడిగి మరీ తెలుసుకుంటుంది. తాజాగా ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన హన్సిక, శింబు ఓ లిప్ లాక్ ఇచ్చింది. ఇదంతా ప్రవేట్ రెస్టారెంట్ లో జరిగింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు అక్కడే ఉండి, ఇదంతా గమనించారు.

ఈ విషయంలో ఆనోటా, ఈనోటా పడి, ఇఫ్పుడు కోలీవుడ్ నుండి సౌత్ మార్కెట్ అంతా స్ర్పెడ్ అయింది. అయితే ఈ విషయంలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ శింబు, హన్సికలు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలకి ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వకుండా, ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా శింబు రెచ్ఛగొట్టే విధంగా హన్సిక భలే గిప్ట్ ఇచ్చిందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: