సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతున్నారంటే వారు స్టార్ హీరోల కోపానికి బలైపోతారని, ఎదైనా సరే స్టార్ హీరోలను మించి ఎవరు వెళ్ళకుండా ఉండేలా సినిమా పరిశ్రమ మొత్తం ఉంటుందని అంటుంటారు. చూడడానికే వేరు వేరుగా కనిపించే వారంతా ఒక్కటేనని, కేవలం వారు మాత్రమే అభివృద్ధిలోకి వచ్చి మిగతా వారిని తొకేస్తారని అంటుంటారు.

 

అయితే కనిపించ కుండా వినిపించే వచ్చే ఈ వాదనలన్నీ నిజమేనా..? ఇక కొత్త దర్శకులు హీరో ల పట్ల కూడా కొందరు సినిమా పెద్దలు తమ కోపాన్ని చూపిస్తున్నారన్న వాదనా ఉంది. అయితే మోసానికి గురయ్యామని ఏ దర్శకుడు, ఏ హీరో బయటకు వచ్చి చెప్పట్లేదే.. అంటే అలా చేస్తే ఇక వారిని ఇండస్ట్రిలోనే కనిపించకుండా చేస్తారేమో అనే భయమా..?. సినిమా అంటే మనిషి ఆలోచనల్లోంచి పుట్టేది అంటే ఈ ఆలోచన అనేది ఎవరికైనా రావొచ్చు. ఏ చిన్న దర్శకుడైనా సరే అద్భుతమైన సినిమా చేయొచ్చు కాని వారికి అవకాశం వస్తేనే కదా అసలు సినిమా తీసేది.

 

సినిమా పరిశ్రమలో లోలోపల చాలా గుబులు పుట్టించే సంఘటనలు జరుగుతున్నాయని అంటుంటారు. కాని అవేవి బయటకు రావు.. కొందరు రానివ్వరు. కనిపించడానికే కలర్ ఫుల్ గా కనిపించే తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నో కుట్రలతో కుతంత్రాలతో నిండి ఉన్నదని అసలు విషయం తెలిసినా ఎవ్వరూ దాన్ని ఎదురించలేరు.  

 

ఒక హీరో ఇంకో హీరోని పొగడటం.. బయటకు వెళ్లి అదే హీరో గురించి చెడుగా మాట్లాడటం మామూలే. ఇక నిర్మాణ సంస్థలన్నీ కేవలం నలుగురు బడా నిర్మాతల కనుసన్నల్లో ఉంటున్నాయన్నది కూడా అందరు అనుకునే విషయమే. కనిపించేంత మంచి తనం ఇండస్ట్రి పెద్దల్లో ఉండదని అంటారు. మరి కనిపిందే మంచి ఏమిటి. అసలు కనిపించే వన్ని నిజాలేనా.. ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు..?   


మరింత సమాచారం తెలుసుకోండి: