అమరావతి రాజధాని నగరంలో పవన్ కళ్యాణ్ నగర్ ఉంటుంది అంటే అది పవన్ అభిమానులకు ఊహించని అద్భుతమే. ఇప్పుడు అటువంటి సంఘటన ఒకటి జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. తన పుట్టిన రోజువేడుకులకు దూరంగా ఒక అజ్ఞాత ప్రాంతానికి పవన్ వెళ్ళిపోయినా అతడి అభిమానులు మాత్రం  పవన్ పుట్టిన రోజును అత్యంత ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ పుట్టిన రోజునాడే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరగబోతున్న గ్రామాలలో ఒకటి అయిన బేతంపూడిలో ఆగ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. 

గుంటూరు జిల్లాకు చెందిన బేతం పూడి గ్రామస్థులు తమ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీకి  పవన్ కళ్యాణ్ నగర్ అని పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ తమ గ్రామానికి రెండు సార్లు రావడమే కాకుండా అక్కడి రైతుల సమస్యలకు బాసటగా నిలిచినందులకు బేతం పూడి గ్రామప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo  రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసమీకరణకు తమ భూములు ఇవ్వడానికి మొదటి నుంచి బేతంపూడి గ్రామ రైతులు వ్యతిరేకేస్తున్న నేపధ్యంలో పవన్ ఆగ్రామానికి వెళ్ళడమే కాకుండా ఒక సాధరణ వ్యక్తిలా అక్కడి గ్రామ ప్రజలతో కలసిపోయిన విషయం తెలిసిందే. 

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo ఆ ఊరిలోని చిన్నకారు రైతుల పై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసిన నేపధ్యంలో పవన్ మళ్ళీ పెనుమాక, బేతం పూడి గ్రామాలకు వచ్చి తెలుదేశ ప్రభుత్వo  పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన తారువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో వెనకడుగు వేసిన నేపధ్యంలో పవన్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా బేతం పూడి గ్రామస్థులు ఒకకాలనీకి పవన్ పేరుపెట్టడం జరిగింది అంటున్నారు. 

ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాలలోకి వచ్చి సరిగా ప్రశ్నించకపోయినా ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ప్రత్యక హోదా విషయమై తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయకపోయినా ఇంకా అనేక విషయాలపై తన మౌనాన్ని కొనసాగిస్తున్నా ఆ విషయాలు ఏమి పట్టించుకోకుండా బేతం పూడి గ్రామా ప్రజలు పవన్ కు గౌరవం ఇచ్చిన నేపధ్యంలో నిజంగా పవన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే ఇంకా ఎన్ని సంచలనాలు ఉంటాయో అన్నది ఊహకు అందని ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: