ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ బాహుబలి. బాహుబలి సక్సెస్ అనేది తెలుగు సినిమా గర్వపడేలా ఉంది. ప్రపంచ సినీ చరిత్రలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ తలెత్తుకు నిలబడేలా రాజమౌళి తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే బాహుబలి మూవీ అనంతరం రాజమౌళి, బాహుబలి సీక్వెల్ కి సిద్ధం అయిపోయాడు.

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజిగా మారిపోయాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ కి చెందిన దాదాపు 18 మంది స్టార్ హీరోలు రాజమౌళికి రిక్వెస్ట్ లు పంపారంట. బాహుబలి సీక్వెల్ లో వారి కంటూ ఓ స్పెషల్ రోల్ ఇవ్వాలని, అది ఒక ప్రేమ్ ఉన్నా చాలు అని చెప్పారంట. అందుకు రాజమౌళి సైతం కూల్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇంత మంది తెలుగు హీరోలని ఏ సన్నివేశంలో చూపిస్తే బాగుంటుందనేది, ప్రస్తుతం రాజమౌళి ఆలోచిస్తున్నాడు.

వీరి వల్ల బాహుబలి సెకండ్ పార్ట్ కి ఎటువంటి నష్టం రాకుండా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే బాహుబలి పార్ట్1 బడ్జెట్ కంటే బాహుబలి పార్ట్2 బడ్జెట్ దాదాపు రెట్టింపు గా ఉంటుందని చిత్రవర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి రెండు పార్ట్ లు కలిపి 250 కోట్ల రూపాయలు. ఇందులో ఇప్పటి వరకూ ఖర్చు పెట్టిన బడ్జెట్ 120 కోట్ల రూపాయల.  రెండో పార్ట్ కి ఖర్చు ఇంకా ఖర్చు పెట్టాల్సినది 130 కోట్ల రూపాయలు.

అయితే అనుకున్న బడ్జెట్ ప్రకారం వెళితే బాహుబలి పార్ట్2 దాదాపు 80 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే బాహుబలికి అయిన ఖర్చు 210 కోట్ల రూపాయలు. అయితే బాహుబలి సాధించిన విజయంతో నిర్మాతల్లో పూర్తి ధైర్యం వచ్చేసింది. సెకండ్ పార్ట్ కోసం దాదాపు 150 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చూస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో యుద్ధ సన్నివేశాలు, మేకప్ తో పలు సన్నివేశాలను రిచ్ గా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: